సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు.. ఆతృతగా ఎదురు చూసిన చిత్రం సర్కారు వారి పాట గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ కలిసి సంయుక్తంగా నిర్మించిన సర్కారు వారి పాట చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. సినిమా రిలీజ్‌కు ముందే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాలపై అంచనాలను ఓ రేంజ్‌లో పెంచగా.. ఇక తమన్ ఇచ్చిన కళావతి, పెన్నీ.. మ..మ..మహేశ్ పాటలు సినిమా పైన బీభత్సమైన హైప్‌ని క్రియేట్ చేశాయి. మరీ ముఖ్యంగా ట్రైలర్‌లో మహేష్ పంచిన కామెడీ సినిమాకు హైలెట్‌గా నిలవబోతుందని.. ఈ సినిమాలో పరశురామ్.. మహేష్ బాబులోని అన్ని యాంగిల్స్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడనే టాక్ వినిపించింది. దాంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ నేపథ్యంలో గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్కారు వారి పాట మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
ఇదీ చదవండి: మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ మూవీ రివ్యూ!
ఇక సినిమా కథ విషయానికి వస్తే.. యూఎస్‌లో అప్పులిచ్చే కంపెనీ పెడతాడు మహేష్ (మహేష్ బాబు). అయితే కళావతి (కీర్తి సురేష్) కేసినో వంటి పిచ్చి అలవాట్ల మోజులో పడి.. మహేష్ దగ్గర అబద్దాలు చెప్పి అప్పులు తీసుకుంటుందట. ఆ తరువాత అసలు విషయం తెలుసుకున్న మహేష్ బాబు కీర్తి ప్రేమలో పడిపోతాడు. ఇలా సాగుతున్న మూవీ.. నదియా ఎంట్రీతో కీలక మలుపు తిరుగుతుంది. మహేష్ బాబుకు నదియా ఎయిర్ పోర్ట్‌లో పరిచయం అవుతుంది. ఆమె కష్టాన్ని తెలుసుకున్న మహేష్ బాబు.. దాన్ని తీర్చడం కోసం ఇండియాకు వస్తాడు. ఇక్కడ రాజేంద్ర నాథ్ ( సముద్ర ఖని) బ్యాంక్స్ లూప్ హొల్స్ ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించి ఉంటాడు. ఇక ఇండియాకు వచ్చిన మహేష్‌కు ఇక్కడ ఎదురైన అనుభవాలు ఏంటి?.. ప్రజల సమస్యలను అతను ఎలా తీర్చాడు? చివరకు కళావతి కథ ఏమైంది.. రాజేంద్ర నాథ్ పాత్ర ఏంటి.. అతను చేసే మోసాలు ఎలా ఉంటాయి.. ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న లోపాలను మహేష్ ఎలా ఎత్తి చూపాడు అన్నదే మిగిలిన స్టోరి.
ఇది కూడా చదవండి: Mahesh Babu: ఒక్క సినిమాకు మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు!
ఇక మూవీ చూసిన వారంతా మహేష్ బాబు వన్ మెన్ షో అని.. ఇది సర్కారు వారి పాట కాదు.. మహేష్ బాబు మాస్ ఆట.. ఇకపై బాక్సాఫీస్ రికార్డుల వేట అనిపిస్తోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి సర్కారు వారి పాట ప్రపంచ వ్యాప్తంగా హిట్ టాక్ సొంతం చేసుకోవడం మాత్రం విశేషం. ఇక మూవీలో మహేష్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. పోకిరి తరువాత మహేష్ బాబుని ఇంత ఎనర్జీటిక్ రోల్‌లో చూడటం ఇదే ప్రథమం. ఈ సినిమాలో ఇక మహేష్ స్టెప్పులు కూడా కుమ్మేయడంతో ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ దొరికినట్టే. థమన్ మ్యాజికల్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసింది. దర్శకుడిగా పరశురాం సూపర్ హిట్ అనిపించుకున్నాడు.
ఇది కూడా చదవండి: Sarkaru Vaari Paata : సర్కారు వారి పాటని టార్గెట్ చేశారా? ఫ్యాన్ వార్ మళ్ళీ మొదలైందా?
ప్లస్ పాయింట్స్:
మహేష్ క్యారెక్టరైజేషన్
మహేష్ నటన
లవ్ ట్రాక్
పరుశురామ్ డైలాగ్స్
థమన్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
కథలో కాస్త కొత్తతనం లోపించడం
అక్కడక్కడ స్లో అవ్వడం
చివరి మాట: సర్కారు వారి పాట.. మహేష్ ఆడిన మాస్ ఆట
రేటింగ్: 2.75/4