సంయుక్త మేనన్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిన విషయం తెలిసిందే. చేసిన మూడు సినిమాలతోనే తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ మలయాళ భామను తెలుగమ్మాయిగా యాక్సెప్ట్ చేశారు. టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా కూడా మారిపోయింది.
సంయుక్తా మేనన్.. ప్రస్తతం ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలో మారుమ్రోగుతున్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు చాలా దగ్గరైపోయింది. చేసింది మూడే మూడు సినిమాలు అయినా కూడా తమిళ్, మలయాళంలో అన్ని సినిమాలు చేస్తే వచ్చిన క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్ కెరీర్ ప్రారంభంలోనే దొరికింది. ఆమె తెలుగులో చేసిన మూడు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. భీమ్లానాయక్, బింబిసార, సార్ ఈ చిత్రాలు టాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే సంయుక్త మేనన్ అంత తేలిగ్గా హీరోయిన్ గా మారలేదు. కెరీర్ లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంది. సార్ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో మరోసారి సంయుక్తకు సంబంధించిన పాత విషయాలు వైరల్ గా మారాయి.
సంయుక్త మేనన్ తెలుగులో చేసి మూడు చిత్రాలు మంచి ఫలితాలను అందుకున్నాయి. ఈ అమ్మడు మలయాళంలోనే తన కెరీర్ మొదలు పెట్టింది. పాప్ కార్న్ అనే సినిమాతో నటిగా పరిచయం అయ్యింది. రెండేళ్లలోనే తమిళ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. కలారి అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. తర్వాత 2022లో భీమ్లానాయక్ సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె వస్త్రధారణ, కట్టు-బొట్టు, సాంప్రదాయంగా కనిపించే తీరు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె చేసిన మూడు సినిమాల్లో సంయుక్త మేనన్ పదహారణాల తెలుగమ్మాయి పాత్రలే చేసింది. కానీ, ఆమె కెరీర్ లో చాలా ఛాలెంజింగ్ పాత్రలు కూడా చేసింది.
భీమ్లానాయక్ సినిమాకి ముందు తమిళ్ లో ఎరిడా అనే సినిమా చేసింది. ఆ ఎరిడా అనే మూవీ క్రైమ్ డ్రామా. అందులో సంయుక్త మేనన్ నాజర్ తో కలిసి నటించింది. ఆ సినిమాలో సంయుక్త పాత్ర కాస్త బోల్డ్ గానే ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు సంయుక్త గురించి నెట్టింట వెతుకులాట మొదలుపెట్టిన తర్వాత నాజర్ తో చేసిన ఎరిడా సినిమా.. అందులో ఆమె- నాజర్ కలిసి చేసిన సీన్స్, ఫొటోలు కొన్ని వైరల్ గా మారాయి. ఆ సినిమాలో సంయుక్త కాస్త నెగిటివ్ టచ్ ఉండే ఛాలెంజింగ్ పాత్రలో నటించింది. ఆమె కెరీర్ లో హీరోయిన్ గా ఈ స్థాయికి ఎదిగింది అంటే.. అలాంటి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది కాబట్టి ఇక్కడి దాకా రాగలిగింది అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇంక ఆమె కెరీర్ విషయానికి వస్తే.. టాలీవుడ్ లో సంయుక్త మేనన్ గోల్డెన్ లెగ్ గా పేరు సొంతం చేసుకుంది. ఆమె టాలీవుడ్ నుంచి అవకాశాలు క్యూ కడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం సంయుక్త సార్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. బూమరాంగ్ అనే మలయాళం సినిమా కూడా చేస్తోంది. ఆమెకు అసలు సినిమాలపై ఆసక్తిలేకపోయినా విధే తనని ఇక్కడ నిలబెట్టింది అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. తన చుట్టుపక్కల ఉండే వారికి ఏదో సినిమాలో నటించాను అని చెప్పుకోవడానికే ముందు సినిమా చేశానన్నారు. ఆ తర్వాత మళ్లీ స్టడీస్ మీద దృష్టి పెట్టానన్నారు. తర్వాత నటిస్తూ నటిస్తూ సినిమాలపై తనకి ఆసక్తి పెరిగిందని తెలిపింది. ఈ ఎరిడా సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.