సమంత.. టాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన నటన, అందం, అభినయం, డాన్స్ ఇలా ఒకటేమిటి అన్నింటా ఆమె నంబర్ వన్ అని నిరూపించుకుంది. ప్రస్తుతం సమంత లీడ్ రోల్ లో నటించింన యశోద మూవీ టీజర్ విడుదలైంది. ఈ సినిమాని హరి-హరీష్ దర్శకత్వం వహిస్తుండగా.. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళం భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన టీజర్‌తో అవి కాస్తా రెట్టింపు అయ్యాయి. ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా ఏదో సస్పెన్స్ డ్రామా కూడా కనిపిస్తోంది.
టీజర్ కట్ చూసి ప్రేక్షకులు, సమంత అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే హాలీవుడ్ స్థాయికి తీసిపోకుండా ఆ టీజర్ అనేది కనిపిస్తోంది. ఒక ప్రెగ్నెంట్ లేడీని దూరంగా అడవుల్లో ఒక మేజ్లో పడేస్తే ఆమె ప్రాణాలతో బయటపడటమే సినిమా కథగా తెలుస్తోంది. అలా పారిపోయి బయటపడే క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, ఆమెకు అనుభవించిన చిత్ర హింసలను ఎంతో చక్కగా చూపించారు. చాలా అమాయకంగా కనిపించే యువతి పాత్రలో సమంత నటిస్తోంది. ఇంక సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం సమంత మళ్లీ సినిమాల జోరు పెంచిందనే చెప్పాలి. అటు బాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేసేందుకు సమంత ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్- అక్షయ్ కుమార్ నెక్ట్స్ సినిమాలో సమంత నటించనున్నట్లు చెబుతున్నారు. యశోద టీజర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.