పెళ్లికూతురు లుక్ లో సమంత కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి ఒక యాగంలో కూడా పాల్గొన్నారు.
ఇటీవల సమంత ప్రేమ గురించి ఒక పోస్ట్ పెట్టింది. ‘ఏదీ చావు నుంచి మనల్ని కాపాడదు. కనీసం ప్రేమ అయినా మనల్ని జీవితం నుండి కాపాడాలి’ అంటూ చిలీ దేశానికి చెందిన ప్రముఖ రచయిత పాబ్లో నెరుడా చెప్పిన సూక్తిని షేర్ చేసింది. దీంతో సమంత ప్రేమలో పడ్డారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ వ్యక్తి ఎవరు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరోవైపు సమంత సినిమాలకు కొన్నాళ్ళు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నట్టు వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీంతో సమంత మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సమంతకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సమంత పెళ్లి కూతురు లుక్ లో కనిపించారు. గుడిలో నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం సమంత, విజయ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తయ్యింది. ఈ మూవీ ఆఖరి షెడ్యూల్ ద్రాక్షారామం పరిసర ప్రాంతాల్లో మొదలైంది. విజయ్, సమంతలకు సంబంధించి క్లైమాక్స్ ఎపిసోడ్ ని షూట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇందులో నటీనటులు యాగం నిర్వహిస్తుండగా.. వెనుక సమంత, విజయ్ దేవరకొండ సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తారు. పెళ్లికూతురు, పెళ్ళికొడుకు గెటప్ లో కనిపిస్తారు. ఇక ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో విజయ్, సమంత భార్యాభర్తలుగా కనిపిస్తారని తెలుస్తోంది. సమంత ఖుషి సెట్స్ నుంచి ఒక సెల్ఫీ తీసుకుని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో ఆమె మెడలో నల్లపూసలు కనిపించాయి. విభిన్న నేపథ్యాలు కలిగిన అమ్మాయి, అబ్బాయి మధ్య చిగురించే ప్రేమ కథ ఇది. ఈ సినిమాలో సమంత ముస్లిం యువతి పాత్రలో ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతుంది.
ఇదిలా ఉంటే సమంత మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఈ వ్యాధి బారిన పడ్డ సమంత ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో యశోద, శాకుంతలం సినిమాలకు ఇంట్లో ఉండి డబ్బింగ్ చెప్పారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఈ సినిమా తర్వాత సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్ లు కూడా తిరిగి ఇచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని.. ఈ గ్యాప్ లో చికిత్స చేయించుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Look at this goddess🧿❤️@Samanthaprabhu2 #SamanthaRuthPrabhu #Kushi pic.twitter.com/N4kbCl0n8D
— NARESH (@naresh__off_) July 4, 2023
@samantharuthprabhuoffl and @thedeverakonda perform a Pooja at the last schedule of their movie #Kushi ❤️ 🙏#samantha #samantharuthprabhu #nagachaitanya #samantharuthprabhufans #nagachaitanyafans #varundhawan #samantharuthprabhu #SamanthaRuthPrabhu #nagachaitanya pic.twitter.com/dI6z95LBrE
— BTown Ki Billi South Cinema (@bkbsouthcinema) July 5, 2023