దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో 'సలార్' ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ చేసినప్పుడే మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్ ఓ అంచనాకి వచ్చేశారు. అప్పటినుండి సలార్ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇంతలోనే సలార్ ఓ క్రేజీ సెన్సేషన్ క్రియేట్ చేసి వార్తల్లో నిలిచింది.
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ‘సలార్’ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. కేజీఎఫ్, కాంతార చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన హోంబలే ఫిలిమ్స్ వారు సలార్ ని నిర్మిస్తున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. బాహుబలి సిరీస్, సాహో సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రభాస్.. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘సలార్’పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అసలు ఈ కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ చేసినప్పుడే మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్ ఓ అంచనాకి వచ్చేశారు.
అప్పటినుండి సలార్ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సాలిడ్ మాఫియా యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని భారీ స్థాయిలో రూపొందిస్తున్నాడు ప్రశాంత్ నీల్. కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 28న సలార్ వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసి.. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇలాంటి తరుణంలో.. సలార్ రిలీజ్ కి ఇంకా సుమారు 6 నెలల టైమ్ ఉన్నప్పటికీ.. రోజురోజుకూ ఇండస్ట్రీలో, మూవీ లవర్స్ లో ఈ సినిమా అంచనాలు రెట్టింపు చేస్తోంది. ఇంతలోనే సలార్ ఓ క్రేజీ సెన్సేషన్ క్రియేట్ చేసి వార్తల్లో నిలిచింది.
గతేడాది కేజీఎఫ్ 2 రిలీజ్ ముందే చాలా రోజులకు ముందే ‘బుక్ మై షో’లో లక్షకు పైగా ఇంటరెస్ట్స్ నమోదు చేసి రికార్డు సెట్ చేసింది. ఇప్పుడదే బాటలో సలార్.. 6 నెలల ముందే లక్షకు పైగా ఇంటరెస్ట్స్ నమోదు చేసి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బుక్ మై షోలో ప్రెజెంట్ సలార్ పై ఉన్న లక్షల మంది ఇంటరెస్ట్స్ చూస్తేనే.. ప్రేక్షకులు సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థమవుతుంది. ఇక సలార్ లో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. జగపతి బాబు కూడా కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకి దాదాపు కేజీఎఫ్ కి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేస్తున్నారు. మరి సలార్ పై మీ అంచనాలు ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
The anticipation for the biggest action saga is sky high 🔥
Massive 100K Interests for #Salaar on @bookmyshow!#Prabhas #PrashanthNeel #VijayKiragandur @hombalefilms @PrithviOfficial @shrutihaasan @IamJagguBhai @bhuvangowda84 @RaviBasrur @anbariv @shivakumarart @SalaarTheSaga pic.twitter.com/ycG3o0mrAl— Vamsi Kaka (@vamsikaka) March 2, 2023