దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో 'సలార్' ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ చేసినప్పుడే మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్ ఓ అంచనాకి వచ్చేశారు. అప్పటినుండి సలార్ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇంతలోనే సలార్ ఓ క్రేజీ సెన్సేషన్ క్రియేట్ చేసి వార్తల్లో నిలిచింది.