దేశం మొత్తాన్ని ఊపేసిన 'ద కేరళ స్టోరీ' ఇప్పుడు తెలుగు రిలీజ్ ఫిక్స్ అయిపోయింది. డీటైల్స్ కూడా బయటకొచ్చేశాయి. ఇంతకీ మీలో ఎవరైనా ఈ సినిమా చూశారా?
ఓ సినిమా కోసం దేశమంతా మాట్లాడుకోవడం, లెక్కకు మించి వివాదాలు ఏర్పడటం.. అప్పట్లో ‘ద కశ్మీర్ ఫైల్స్’ విషయంలో జరిగితే.. ఇప్పుడు ‘ద కేరళ స్టోరీ’ విషయంలో జరుగుతోంది. లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని తీసిన ఈ సినిమా కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారిపోయిందనే చెప్పాలి. ఈ మూవీ విషయంలో జరిగిన గొడవలు సుప్రీం కోర్టు వరకు వెళ్లాయంటే మీరే అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఆ తేదీ ఎప్పటినుంచి? ఈ మూవీ సంగతేంటి?
అసలు విషయానికొచ్చేస్తే.. సినిమాని ఆల్మోస్ట్ అందరూ ఎంటర్ టైన్ మెంట్ కోసమే చూస్తుంటారు. కొందరు డైరెక్టర్స్ మాత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా మూవీస్ తీస్తుంటారు. అన్నీ అని చెప్పలేం గానీ కొన్నిసార్లు మాత్రం వివాదాలు చెలరేగుతుంటాయి. ‘ద కేరళ స్టోరీ’ విషయంలో సరిగ్గా అదే జరిగింది. కేరళలో అమ్మాయిల్ని లవ్ జిహాద్ పేరుతో ఇస్లాంలోకి మార్చి, వాళ్లని ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారని గతంలో కొన్ని వార్తలొచ్చాయి. అయితే ఆ లిస్టులో 32 వేల మందికి పైగా ఉన్నారని ఈ మూవీ మేకర్స్ ఫస్ట్ ప్రకటించారు.
కానీ కేరళలో 32 వేలమంది అమ్మాయిలు.. లవ్ జిహాద్ బారిన పడలేదని కేరళ ప్రభుత్వం వాదించింది. ఇదో పెద్ద గొడవ అయిపోయింది. దీంతో ఆ నంబర్ ముగ్గురిగా మార్చి సినిమాని రిలీజ్ చేశారు. మే 5న అన్ని భాషల్లో విడుదల చేస్తామని అన్నారు కానీ హిందీ వరకే పరిమితం చేశారు. వారం గడిచిన తర్వాత అంటే ఇప్పడు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రోజు అంటే శనివారం(మే 13) నుంచి తెలుగు వెర్షన్ కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. మరి ‘ద కేరళ స్టోరీ’పై మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేయండి.