‘కోన్ బనేగా కరోడ్ పతి’ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ షో టైటిల్ లాగానే ఎప్పుడు ఎవరిని అదృష్టం వరిస్తుందో చెప్పలేం. అలా కోటితో తిరిగెళ్లినోళ్లు కూడా ఉన్నారు. కోటితో తిరిగెళ్లిన రెండో వ్యక్తిగా సెక్యూరిటీ గార్డ్ కుమారుడు సాహిల్ ఆదిత్య అహిర్‌వార్(19) నిలిచాడు. ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పలేక.. క్విట్ అయ్యి రూ.కోటితో తిరిగెళ్లాడు. కోటి రూపాయల ప్రశ్న సమయంలోనే బాగా ఇబ్బంది పడిన సాహిల్ లైఫ్ లైన్ సాయంతో సమాధానం చెప్పాడు. ఇక రూ.7 కోట్ల ప్రశ్న విషయానికి వస్తే అది ఎంతో కఠినమైన ప్రశ్న కావడంతో క్విట్ అయ్యి మంచి పని చేశాడు.
ఇదీ చదవండి: ఫ్లాపైన జెస్సీ- సిరి గేమ్ ప్లాన్.. కన్నీరు పెట్టుకుంటూ షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్
కోటి గెలవడమే కాదు.. అతని లైఫ్ స్టోరీ కూడా అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా బిగ్ బి అమితాబ్‌ను ఎంతో ఆశ్చయర్యానికి గురి చేసింది కూడా. మధ్యప్రదేశ్ ఛతర్‌పూర్‌కి చెందిన సాహిల్ ఆదిత్య అహిర్‌వార్ మొదటి నుంచి రెస్పాన్సిబుల్ ఉండే వ్యక్తి కాదు. రెండేళ్ల క్రితం వరకు కూడా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండేవాడంట. సినిమాలు, స్నేహితులు, దుబారా ఖర్చులు చేస్తూ ఉండేవాడు. తండ్రి నోయిడాలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం తన జీవితానికి ఒక లక్ష్యం ఉండాలని సాహిల్ నిర్ణయించుకున్నాడు. గ్రూప్స్‌కి ప్రిపేర్ అవ్వడం ప్రారంభించాడు.
అందరిలానే సాహిల్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కేబీసీకి ఎస్‌ఎంఎస్ చేస్తూ ఉండేవాడు. ఒకసారి లక్కీగా పిలుపు వచ్చింది. వచ్చి కోటీశ్వరుడయ్యాడు. అతను చెప్పలేకపోయిన ఆ కఠినతర ప్రశ్న ఏంటని అందరూ వెతుకులాట మొదలు పెట్టారు. ఆ ప్రశ్న ‘ఏ పక్షి జీర్ణవ్యవస్థ పశువుల తరహాలో ఆహారాన్ని పులియబెట్టడానికి అనువుగా ఉంటుంది. ముఖ్యంగా ఆకులు, మొగ్గలు తినేందుకు సహకరిస్తోంది?’ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక సాహిల్ క్విట్ అయ్యాడు. అందుకు ఆప్షన్స్ A. Shoebill Stork B. Hoatzin C. Shoveler D. Galapagos cormorant. ఆప్షన్ B హోఆట్జిన్ అన్నది సరైన సమాధానం. ఎంతో సంతోషంతో కోటి రూపాయలు, కారుతో వెనుదిరిగాడు సాహిల్ ఆదిత్య అహిర్‌వార్.