బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే షూటింగ్ వెళ్తూ.. హెల్మెట్ ధరించని సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, తాజాగా ఇన్‌స్టాలో మరో పిక్ పోస్ట్ చేసిన అమితాబ్.. తను ‘అరెస్ట్’ అయ్యానంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే షూటింగ్ వెళ్తూ.. హెల్మెట్ ధరించని సంగతి తెలిసిందే. ఈ విషయమై ఒక నెటిజన్ ఆ బైక్ రైడ్స్‌లో వీళ్లిద్దరూ హెల్మెట్ ధరించలేదంటూ ఒక నెటిజన్ వారి ట్వీట్లను ముంబై పోలీసులకు ట్యాగ్ చేశాడు. దీంతో తాను బైక్‌పై ఎక్కడికీ వెళ్లడం లేదని, వీధిలోనే షూటింగ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు బిగ్ బీ. ఇదిలా ఉంటే, తాజాగా ఇన్‌స్టాలో మరో పిక్ పోస్ట్ చేసిన అమితాబ్.. తను ‘అరెస్ట్’ అయ్యానంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మరి అమితాబ్ ఈ పోస్ట్ ఎందుకు పెట్టాడో ఇప్పుడు చూద్దాం.
వయసు పెరుగుతున్న అమితాబ్ బచ్చన్ లోని ఎనర్జీ మాత్రం తగ్గడం లేదు. ఏడూ పదుల వయసులో కూడా సినిమాలు చేస్తూ తనలో ఇంకా సత్తా ఉందని చెబుతున్నాడు. ఇటీవలే ముంబైలోని ఒక సినిమా షూటింగ్ కోసం ఒక అపరిచితుడి బైక్‌పై వెనక కూర్చుని వెళ్తున్న పిక్ పోస్ట్ చేశారు. అంతేకాదు సమయానికి షూటింగ్ స్పాట్ చేరుకునేందుకు సాయపడ్డ ఆ బైకర్‌కు ఈ పోస్టులో థాంక్స్ కూడా చెప్పాడు. అయితే హెల్మెట్ లేకుండా ప్రయాణించడం సురక్షితం కాదని మనకు తెలుసు. అయినా బిగ్ బీ ఇలా ఎందుకు చేసాడని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా.. బైక్‌పై అలా ఎందుకు ప్రయాణించాల్సిందో వివరణ ఇచ్చిన అమితాబ్ ఈ సందర్భంగా.. తాను అరెస్ట్ అయినట్లు సరదాగా క్యాప్షన్ పెట్టాడు.
ముంబై పోలీస్ వ్యాన్ పక్కన తను నిలబడి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు బిగ్ బీ. ఈ పిక్‌లో ఆయన గళ్ల చొక్కా, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించగా, ముఖంలో సీరియస్‌నెస్ కనిపించింది. ఇక ఈ ఫొటోకు ‘… అరెస్టెడ్ ..’ అనే క్యాప్షన్ కూడా జతచేయడంతో ఫ్యాన్స్ ఈ పోస్ట్‌పై కామెంట్ చేస్తున్నారు. మీరు అరెస్ట్ కావడం అసంభవం కానీ ఈ పిక్‌లో మీ స్వాగ్ మాత్రం అద్భుతంగా ఉందని కాంప్లిమెంట్ ఇచ్చాడు ఒక నెటిజన్. ‘జీవితాంతం మా హృదయాల్లో అరెస్టయ్యారు సార్’ అంటూ మరొక యాజర్ కామెంట్ చేయగా.. ‘డాన్’ చిత్రంలోని ఫేమస్ డైలాగ్ ‘డాన్‌ను పట్టుకోవడం కష్టమే కాదు అసాధ్యం కూడా’ గుర్తు చేస్తున్నారు. అయితే ‘ఎట్టకేలకు ముంబై పోలీసులు డాన్‌ను పట్టుకున్నారు’ అంటూ ఇంకొందరు ఫన్నీగా వ్యాఖ్యానిస్తుండటం విశేషం. మరి అమితాబ్ ఇలా ఫన్నీగా పోస్ట్ పెట్టడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Amitabh Bachchan ‘arrested’? Big B’s picture with Mumbai Police car amid helmetless bike ride viral; fans say, ‘Don ko pakadna… ‘
#AmitabhBachchan #AnushkaSharma #Arrested #ProjectK
https://t.co/OHjJy6aG7i— Bollywood Life (@bollywood_life) May 19, 2023