పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి మూవీ వస్తోందంటే చాలు ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు కూడా రెడీ అయిపోతారు. తెరపై పవన్ చేసే సందడిని చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అలాంటి పవన్ యాక్ట్ చేసిన ఒక సినిమాను చూసి స్క్రీన్‌ను పగులగొట్టారట బిగ్ బీ అమితాబ్ బచ్చన్.
టాలీవుడ్ హీరోల్లో పవన్ కల్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. పవన్‌ను దేవుడిలా ఆరాధించే అభిమానులకు లెక్కే లేదు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ ఆయన బాటలో లక్షలాది ఫ్యాన్స్ నడుస్తున్నారు. ఇక, పవర్ స్టార్ నుంచి ఒక సినిమా వస్తోందంటే చాలు.. ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తన స్వాగ్, స్టైల్, మేనరిజంతో సిల్కర్ స్క్రీన్‌పై పవన్ చేసే సందడి మామూలుగా ఉండదు. అందుకే మిగతా హీరోల కంటే ఆయనకు భిన్నమైన ఫాలోయింగ్ ఉంది. ప్రేక్షకులే కాదు.. ఎందరో సినీ తారలకూ పవన్ ఇష్టమైన యాక్టర్. అలాంటి పవర్ స్టార్ నటించిన ఒక మూవీ చూసి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్క్రీన్‌ను పగులగొట్టారట. అవును, ఇది నిజమే. పవన్ నటించిన ‘తొలిప్రేమ’ సినిమాను చూస్తూ అమితాబ్ ఇలా చేశారట. టాలీవుడ్ హిస్టరీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన చిత్రాల్లో ఒకటి ‘తొలిప్రేమ’.
అప్పట్లో యూత్‌ను ఒక ఊపు ఊపింది ‘తొలిప్రేమ’. యంగ్ ఆడియెన్స్‌లో పవన్‌కు తిరుగులేని ఇమేజ్ను తెచ్చిపెట్టిందీ మూవీ. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. శనివారం ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. కరుణాకరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం పవర్ స్టార్ కెరీర్‌లో మర్చిపోలేని హిట్‌గా నిలిచింది. అలాంటి ‘తొలిప్రేమ’ గురించి ఆసక్తికర విశేషాలను కరుణాకరన్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ చూస్తూ అమితాబ్ బచ్చన్ చిరాకు పడ్డారన్నారు. హీరోయిన్ను ఎంతగానో లవ్ చేసే పవన్.. క్లైమాక్స్ టైమ్‌లోనూ తన ప్రేమ విషయాన్ని చెప్పలేక మదనడే సీన్ బిగ్ బీకి కోపం తెప్పించిందని తెలిపారు. దీంతో ఆయన తన కారు తాళపు చెవిని స్క్రీన్ మీదకు విసిరేశారని కరుణాకరన్ పేర్కొన్నారు. అయితే హీరోయిన్ తిరిగి హీరో దగ్గరకు రాగానే.. అమితాబ్ పక్కనే కూర్చున్న జయా బచ్చన్ సంతోషంతో చప్పట్లు కొట్టారని గుర్తుచేసుకున్నారు.