కొన్ని సినిమాలను కొంతమంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ చేజేతులారా మిస్ చేసుకుంటారు. బ్లాక్ బస్టర్ హిట్స్ ని మిస్ చేసుకున్న స్టార్స్ చాలా మందే ఉన్నారు. తాజాగా బేబీ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే స్టార్ హీరోయిన్ వదులుకుందట. ఇంతకే ఎవరా హీరోయిన్?
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలుగా రిలీజ్ అయ్యి పెద్ద విజయాలు అందుకుంటున్న సినిమాలు చాలానే ఉన్నాయి. కంటెంట్ బాగుంటే జనాలు ఆదరిస్తారు, అభిమానిస్తారు, ఆపై బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారు. తాజాగా చిన్న సినిమాగా వచ్చి ప్రేక్షకుల మన్నన పొందిన సినిమా బేబి. ఆనంద్ దేవరకొండ, యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య కలిసి నటించిన ఈ చిత్రం జూలై 14న విడుదలైంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో విజయం దిశగా అడుగులు వేస్తుంది. చిన్న దర్శకుడు కావడం వల్లనో ఏమో తెలియదు కానీ ముందు ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు లేవు. ప్రమోషన్స్ విషయంలో కూడా అంతగా ఆసక్తి చూపని మేకర్స్ రిలీజ్ తర్వాత పబ్లిక్ టాక్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఈ చిత్రం అందమైన ప్రేమకథగా తెరకెక్కింది. మంచి టాక్ కూడా రావడంతో మేకర్స్ సంతోషంగా ఉన్నారు. వైష్ణవి చైతన్య నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వైష్ణవికి ఈ రూపంలో ఇన్నాళ్లకు సక్సెస్ లభించింది. అయితే ఈ సినిమాకి హీరోయిన్ గా ముందు అనుకున్నది వైష్ణవి చైతన్యను కాదంట. వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ శ్రీలీలని ఈ సినిమాకి అడిగారట. ఈ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ మొదటగా శ్రీలీల అయితే బాగుంటుందని అనుకున్నాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. శ్రీలీలకు మంచి క్రేజ్ ఉంది తమ సినిమాలో చేస్తే సినిమాకు కూడా మంచి ప్లస్ అవుతుంని డైరెక్టర్ భావించాడట.
అయితే డైరెక్టర్ కథ చెప్తా అంటే వినకుండానే నో చెప్పిందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి అన్ని చోట్ల మంచి టాక్ వస్తుంది. వైష్ణవి చైతన్య బాగా చేసిందన్న ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా శ్రీలీల చేసి ఉంటే సినిమాకి ఇంకా పెద్ద హైప్ వచ్చేదని.. ఇంకా పెద్ద హిట్ అయ్యేదని అంటున్నారు. బ్యాడ్ లక్.. శ్రీలీల మంచి సినిమాని మిస్ చేసుకుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే వైష్ణవి చైతన్య కోసమే శ్రీలీల తప్పుకుందని.. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి బేబీ సినిమాని శ్రీలీల మిస్ చేసుకుందంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.