ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో కాగా.. మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ పై మరింత బాధ్యత పడింది. ఇప్పటివరకూ తెలుగు వారికి తన సత్తా ఏంటో చూపించిన ఎన్టీఆర్ కి.. ఇక నుంచి అంతర్జాతీయ స్థాయిలో చూపించే పరిస్థితి ఏర్పడింది. దీంతో సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జనతా గ్యారేజ్ లాంటి మాసివ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల శివతో ఒకవైపు.. కేజీఎఫ్ లాంటి సాలిడ్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ తో మరొకవైపు ఎన్టీఆర్ సినిమాలు చేస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
అప్పటివరకూ తెలుగు సినిమాగా తీద్దామనుకున్న కొరటాల శివ.. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తీయాలని నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ స్టామినాకి తెలుగు సరిపోదని.. ముందు కథని పాన్ ఇండియా కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న నేపథ్యంలో.. ఆయా భాష నటులను ఈ సినిమాలో నటింపజేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కోలీవుడ్, బాలీవుడ్ నటుల పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్, బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ సహా పలు హీరోల పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ కీలక పాత్ర విలన్ పాత్ర అయి ఉంటుందని సమాచారం.
చియాన్ విక్రమ్ విలన్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక సైఫ్ అలీ ఖాన్ కూడా ఆదిపురుష్ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరిలో ఒకరిని ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ గా నటింపజేయాలని చూస్తున్నట్లు సమాచారం. జనతా గ్యారేజ్ లో మలయాళ హీరో మోహన్ లాల్ ని నటింపజేశారు. ఈ సినిమాని మలయాళంలో కూడా డబ్ చేశారు. అక్కడ కూడా హిట్ గా నిలిచింది. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ 30 కోసం బాలీవుడ్, కోలీవుడ్ నటులను నటింపజేయాలని చూస్తున్నట్లు సమాచారం.
కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో పూజా కార్యక్రమం నిర్వహించి.. వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఇక ఈ చిత్రాన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఎన్టీఆర్, చియాన్ విక్రమ్ కాంబినేషన్ లో సన్నివేశం పడుతుందా? లేక ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ కాంబోలో సీన్ పడుతుందా? ఎవరితో ఉంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
#NTR30 సినిమాలో కీలకపాత్ర కోసం తమిళ్, బాలీవుడ్ నటుల పేర్లు పరిశీలన. #chiyanvikram #SaifAliKhan ఇంకా మరి కొన్ని పేర్లు పరిశీలనలో వున్నాయంటూ వినిపిస్తున్న వార్తలు.
— devipriya (@sairaaj44) February 8, 2023