తెలుగు బుల్లి తెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో… సీజన్ సీజన్‌కి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అయితే ఇదే ఉత్సాహంతో ఓటీటీలోకి తీసుకొచ్చిన ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. ఏది ఏమైనప్పటికి.. త్వరలోనే ఆరో సీజన్‌ని ప్రారంభించి, ఆ లోటుని తీర్చుకోవాలని భావిస్తున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు. సెప్టెంబర్ మొదటి వారంలో ఆరో సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షో మొదలు కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే సీజన్ 6లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
షో ప్రారంభం సంగతి సరే.. మరి కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తుండగా.. వీరిలో వడ్డే నవీన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అసలు ఆయన సినిమాల్లో కనిపించే చాలా ఏళ్లైంది. ఒకప్పుడు స్టార్ హీరో హోదా అనుభవించిన వడ్డే నవీన్‌ని బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకువచ్చేందుకు షో నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. వడ్డే నవీన్ చాలా ఏళ్లుగా అటు సినిమాల్లో కానీ.. ఇటు మరే ఇతర ఈవెంట్లలో కానీ కనిపించలేదు. అసలు ఆయన్ని చూసి చాలా ఏళ్లే అయ్యింది.
ఇది కూడా చదవండి: Y Vijaya: నేను ఆర్థికంగా స్థిరపడడానికి విజయశాంతియే కారణం: వై విజయ
అయితే వడ్డే నవీన్ తెరపై కనిపించి ఏళ్లు గడుస్తున్నా.. ఆయన ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా నవీన్‌కి మహిళా ప్రేక్షకుల నుంచి ఆదరణ చాలానే ఉంది. అందుకే తెరమరుగైన నటీనటులను ఇంటర్వ్యూలు చేసే వివిధ కార్యక్రమాల్లో చాలామంది ప్రేక్షకులు వడ్డే నవీన్‌ని షోకి తీసుకురావలని కోరుతుంటారు. ఆయనని ఒక్కసారి కనీసం టీవీలో అయినా చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Samantha Ad: వైరలవుతోన్న సమంత పాత యాడ్స్! అప్పుడు ఎలా ఉందో చూడండి!
బయట నవీన్‌కున్న ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకుని.. బిగ్ బాస్ వాళ్లు వడ్డే నవీన్‌ని షోలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరారట. అయితే ఒకప్పుడు స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగిన నవీన్ బిగ్ బాస్ 6లోకి వచ్చేందుకు ఆసక్తి చూపించకపోవడంతో భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. తిరిగి సినిమాలతోనే బాగుంటుంది కానీ.. బిగ్ బాస్ ద్వారా అయితే వద్దని అతని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇలాంటి తరుణంలో వడ్డే నవీన్ బిగ్ బాస్ సీజన్ 6కి కంటెస్టెంట్‌గా వస్తారా.. రారా అన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ వస్తే మాత్రం అతను ఖచ్చితంగా సీజన్ 6లో స్పెషల్ అట్రాక్షన్ అవుతారు.. గెలిచే అవకాశాలే అధికం అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Priyanka Jawalkar: బాయ్‌ఫ్రెండ్‌తో డేట్‌కి వెళ్లిన ప్రియాంక జవాల్కర్.. ఆ క్రికెటరే అంటున్న నెటిజనులు!