ఎట్టకేలకు ‘బిగ్ బాస్ 6’ పూర్తయిపోయింది. ముందు నుంచి కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులు అనుకుంటున్నట్లే సింగర్ రేవంత్ టైటిల్ గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే అందరూ అతడికి విషెస్ చెబుతున్నారు. కానీ రియల్ విన్నర్ మాత్రం శ్రీహాన్. ఈ విషయాన్ని స్వయంగా హోస్ట్ నాగార్జునే బయటపెట్టాడు. ఈ తతంగం మొత్తం చూసి ఆడియెన్స్ కూడా షాకయ్యారు. అసలు ఇలా ఎలా జరిగిందా అని అవాక్కయ్యారు. ఇక శ్రీహాన్ కూడా కాసేపు అలా షాక్ లో ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గత ఐదు సీజన్లతో పోలిస్తే ఈసారి ‘బిగ్ బాస్’ చాలా సాధారణంగా సాగింది. కాస్తో కూస్తో రేవంత్ తప్పించి తెలిసిన కంటెస్టెంట్స్ ఒక్కరు కూడా లేకపోవడం చాలా పెద్ద మైనస్ అయినట్లు కనిపించింది. కానీ షో ప్రారంభమైన కొన్నాళ్లకు గీతూ, శ్రీహాన్, ఇనయా లాంటి వాళ్లు తమ గేమ్ తో రిజిస్టర్ అయ్యారు. దాన్నే కంటిన్యూ చేస్తూ వచ్చారు. కానీ ఓటింగ్ పేరు చెబుతూ గీతూని మధ్యలోనే ఎలిమినేట్ చేశారు. దీంతో షో చూస్తున్న ఆ కొందరు కూడా షాకయ్యారు. టాప్-5లో ఉంటుందనుకున్న కంటెస్టెంట్ మధ్యలోనే ఎలిమినేట్ చేసేస్తారని బిగ్ బాస్ పైనే మండిపడ్డారు.
ఇక గీతూ వెళ్లిపోయిన తర్వాత రేవంత్, ఇనయా మధ్య ఓటింగ్ విషయంలో ఎప్పుడూ పోటాపోటీగా ఉండేది. అందుకు తగ్గట్లే వాళ్లిద్దరూ గేమ్ కూడా బాగా ఆడుతూనే వచ్చారు. ఇక శ్రీహాన్, ఆదిరెడ్డికి బిగ్ బాస్ లోకి రాకముందే షోపై పూర్తి అవగాహన ఉండటం వల్ల స్ట్రాటజీతో గేమ్ ఆడుతూ వచ్చారు. అలా రేవంత్ తోపాటు వీళ్లిద్దరూ కూడా ఫినాలే వరకు వచ్చేశారు. రోహిత్, కీర్తి భట్ కూడా చాలా హుందాగా ఉంటూ, ప్రేక్షకులు మనసు గెలుచుకుని చివరి వరకు వచ్చేశారు. ఇక తాజాగా ఫినాలే ఎపిసోడ్ జరగ్గా.. రేవంత్ టైటిల్ దక్కించుకున్నాడు. కానీ రియల్ విన్నర్ శ్రీహానే అని హోస్ట్ నాగార్జున అందరికీ షాకిచ్చాడు.
చివరి వరకు రేవంత్-శ్రీహాన్ టైటిల్ కోసం నువ్వానేనా అనేట్టు పోటీపడ్డారు. అయితే కరెక్ట్ గా టైటిల్ ఇవ్వడానికి ముందు రూ.40 లక్షల సూట్ కేసుని శ్రీహాన్ తీసేసుకున్నాడు. కాదు కాదు మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా అతడిని తీసుకునేలా టెంప్ట్ చేశారు. ఈ క్రమంలోనే గేమ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో టైటిల్ విన్నర్ గా రేవంత్ ని ప్రకటించారు. ట్రోఫీ అతడి చేతిలో పెట్టేశారు. ప్రైజ్ మనీ రూ.50 లక్షల్లో శ్రీహాన్ కి రూ.40 లక్షలు, మిగిలిన రూ.10 లక్షలు రేవంత్ కి వెళ్లాయి. అయితే చివర్లో బాంబ్ పేల్చిన నాగార్జున.. ఓట్ల ప్రకారం శ్రీహాన్ విన్నర్ అని అన్నాడు. రేవంత్ కంటే శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయని, ఇప్పుడు ఇద్దరూ విజేతలేనని ప్రకటించాడు.ఇక చివర్లో డబ్బులు తీసుకోవడానికి శ్రీహాన్ ఒప్పుకొన్నాడు కాబట్టి రేవంత్ విన్నర్ అయ్యాడు. రియల్ విన్నర్ మాత్రం శ్రీహాన్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Revanth just got Trophy because Srihan took money, Else No Trophy, No car, No plot, No cash for Reventh.
Perfect Verdict for an Imperfect Season!!! #BiggBossTelugu6 #Srihan #Srihaan #Revanth pic.twitter.com/VRfzAumYA0
— BigBoss Telugu Views (@BBTeluguViews) December 18, 2022