Priyanka Jawalkar Instagram Photo Netizens Says He His Venkatesh Iyer: మన దగ్గర సినిమాలకు, రాజకీయాలకు ఎంతటి అవినాభావ సంబంధం ఉందో.. అలానే క్రికెట్‌కి, సినిమాలకు కూడా అంతే బంధం ఉంది. ఈ రెండు వర్గాలకు చెందిన వారు.. ఒకరిపై ఒకరు పరస్పరం మనసు పారేసుకోవడం, కలిసి తిరిగడం.. అన్ని కుదిరితే ప్రేమ, పెళ్లి వరకు వెళ్తాయి. లేదంటే మధ్యలోనే బ్రేకప్ అవుతాయి. కానీ ఈలోపు వారి గురించి బోలెడన్ని వార్తలు చక్కర్లు కొడతాయి. ప్రస్తుతం ఓ టాలీవుడ్ హీరోయిన్, యంగ్ క్రికెటర్ గురించి ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టే ఆ క్రికెటర్, హీరోయిన్ పోస్ట్‌లు పెడుతుండటంతో.. ఈ వార్తలకు బలం చేకూరినట్లు అవుతోంది. ఇంతకు ఎవరా హీరోయిన్, క్రికెటర్ అంటే.. ఇది చదవాల్సిందే. టాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా జవాల్కర్ యంగ్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్. వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందంటూ సోషల్ మీడియాలోగత కొన్ని రోజుల నుంచి జోరుగా ప్రచారం అవుతోంది. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఉగాది సందర్భంగా ప్రియాంక షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కు వెంకటేశ్ అయ్యర్ కామెంట్ చేశాడు. దీనికి ప్రియాంక ఇచ్చిన రిప్లై చర్చనీయాంశమైంది. ఇక అప్పటి నుంచి నెటిజనులు వీరిద్దరి సోషల్ మీడియా పోస్టింగ్‌లపై ఓ కన్నేసి ఉంచారు. ఈ క్రమంలో మరోసారి తాజాగా ప్రియాంక జవాల్కర్ చేసిన ఓ పోస్ట్ తెగ వైరలవుతోంది. దీనిలో ఉన్నది వెంకటేష్ అయ్యరే అంటున్నారు నెటిజనులు. ఇది కూడా చదవండి: Virat Kohli: వీడియో: అవుట్ కాలేదంటూ.. బౌలర్‌తో వాదనకు దిగిన విరాట్ కోహ్లీ! ప్రియాంక జవాల్కర్, 2017లో తెలుగులో వచ్చిన కలవరం ఆయే సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన "టాక్సీవాలా" చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. టాక్సీవాల సినిమాతో ప్రియాంకకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. విజయ్ సరసన నటించిన ఈ బ్యూటీ కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలోనూ బోల్డ్ గా, హాట్ గా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా ప్రియాంక షేర్ చేసిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ రెస్టారెంట్లో అబ్బాయితో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఓ రెస్టారెంట్ లో ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్న ఉన్న ఫొటోను షేర్ చేసింది. కానీ తెలివిగా తన బాయ్ ఫ్రెండ్ ముఖం కనిపించకుండా... బ్యాక్ నుంచి మాత్రం చూపించింది. అతగాడు ఫొటోలు తీస్తుంటే క్యూట్‌గా పోజులిచ్చిందీ బ్యూటీ. ఇది కూడా చదవండి: N Jagadeesan: వీడియో: గ్రౌండ్ లోనే మిడిల్ ఫింగర్ చూపించిన యువ ఆటగాడు! View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) ఈ ఫోటోలు షేర్ చేస్తూ 'అతనే లవ్' అంటూ హార్ట్ ఎమోజీ వదులుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ప్రియాంక. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజనులు.. తనతో ఫొటోలో ఉన్న వ్యక్తి ఇండియన్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యరే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బ్యాక్ నుంచి నెక్ భాగం అచ్చు వెంకటేశ్లానే అనిపించడంతో పక్కా అతడే అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Video: ఇలా కూడా అవుట్ అవుతారా? ఇంత దురదృష్టవంతుడిని ఎక్కడా చూసి ఉండరు? View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar)