ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లిన టీమిండియా సిరీస్ ప్రారంభానికి ముందు అక్కడి క్లబ్ క్రికెట్ జట్టుతో వార్మప్ మ్యాచ్‌లు ఆడుతోంది. లీసెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్‌తో జరిగిన మ్యాచ్ నాలుగు రోజు ఆటతో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అబిదినే సకండే బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్ బయటికి వచ్చిన బంతిని కవర్స్‌లోకి ఆడేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ వద్ద భారీ టర్న్ తీసుకుంటూ సెకండ్ స్లిప్ చేతుల్లో వెళ్లిపడింది. వెంటనే తన కోహ్లీ వికెట్ దొరికిందనే ఆనందంలో సకండే సంబురాల్లో మునిగిపోయాడు. ఇతర జట్టు సభ్యులు కూడా అతనిని అనుసరించారు. కానీ అంపైర్ దాన్ని అవుట్‌గా ప్రకటించలేదు. పైగా విరాట్ కోహ్లీ.. తను ఎందుకు అవుట్ కాలేదో బౌలర్ వివరించే ప్రయత్నం చేశాడు. బాల్ అనూహ్యమైన బౌన్స్ అండ్ టర్న్‌తో స్టప్ అయిన తర్వాత సెకండ్ స్లిప్ చేతుల్లోకి వెళ్లిందని.. అంతేకానీ తన బ్యాట్ ఎడ్జ్ తీసుకోలేదని కోహ్లీ.. సకండే వద్దకు వెళ్లి వివరించాడు. కోహ్లీ లాంటి ప్లేయర్ ఇలా ఒక యువ బౌలర్‌కు ఎందుకు అవుట్ కాదో వివరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంపైర్ కూడా దాన్ని నాటౌట్‌గా ప్రకటించడం బౌలర్‌కు కొంత నిరాశను మిగిల్చినా.. అది నిజంగానే బ్యాట్‌కు తాకలేదని తర్వాత తనకు అర్థం అయినట్లు సమాచారం. కాగా.. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్లు వినిపిస్తున్నాయి. నేను అవుట్ కాలేదంటూ.. కోహ్లీ బౌలర్‌తో వాదనకు దిగినట్లు పేర్కొంటున్నారు. గల్లీ క్రికెట్లో అవుట్ అయినా అవుట్ కాలేదంటూ దాబాయించేలా కోహ్లీ.. ఒట్టురా బాబు నేను అవుట్ కాలేదంటూ బౌలర్ చెబుతున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. pic.twitter.com/gfJfRVqAS2 — Guess Karo (@KuchNahiUkhada) June 24, 2022