క్రికెట్ లో ఒక్కోసారి అనేక చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూంటాయి. అలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్లేయర్లతో పాటు క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురవుతుంటారు. కొన్ని సార్లు ఫీల్డర్లు అద్భుతమైన ఫీట్లు చేస్తూ క్యాచ్ లు అందుకుని ఫ్యాన్స్ ని అలరిస్తుంటారు. మరొకవైపు బ్యాటర్లు ఓ రేంజ్ విజృంభింస్తూ.. బౌండరీల వర్షం కురిపిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో బ్యాట్స్ మెన్లు చిత్ర విచిత్రమైన రీతిలో ఔటై.. అభిమానులను నిరాశపరుస్తుంటారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అయితే ఇక్కడ బ్యాటర్ కు దురదృష్టం.. వెంటాడింది. అందుకే బౌండరీ వెళ్లాల్సి బంతి నాన్ స్ట్రైక్ లో ఉన్న బ్యాటర్ బ్యాట్ కి తగిలి చక్కగా ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది. దీంతో బ్యాటర్ తో పాటు అక్కడ ఫీల్డర్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆ దురదృష్టకర బ్యాట్స్ మెన మరెవరో కాదు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ హెన్రీ నికోల్స్. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. యూకేలోని లీడ్స్ వేదికగా ఇంగ్లాడ్, న్యూజిలాండ్ మధ్య ఆఖరి టెస్టు జరుగుతుంది. టాస్ గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ కి దిగింది. ఈక్రమంలో ఇన్నింగ్స్ 55 ఓవర్ ఇంగ్లాడ్ బౌలర్ జాక్ లీచ్ వేసిన బంతిని హెన్రీ.. నాన్ స్ట్రైకర్ వైపు బలంగా షాట్ కొట్టాడు. అయితే అతడికి దురదృష్టం వెంటాడి.. ఆ బంతి నేరుగా నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న మిచెల్ బ్యాట్ కు తగిలి ఆఫ్ మిడ్ ఫీల్డ్ వైపు గాల్లోకి లేచింది. అక్కడ రెడీగా ఉన్న అలెక్స్ బంతిని క్యాచ్ అందుకున్నాడు. అప్పటివరకు ఆచితూచి ఎంతో సంయమనంతో ఆడుతున్న నికోల్స్ ఊహించని విధంగా ఔట్ కావడంతో షాక్ గురై.. నిరాశతో మైదానాన్ని వీడిచి వెళ్లాడు. 95 బంతుల్లో 19 పరుగులతో నిలదొక్కున సమయంలో హెన్రీ ఊహిచని రీతిలో ఔటైయ్యాడు. నికోల్స్ ఔటైవడంతో ఇంగ్లాండ్ ప్లేయర్ సంబరంలో మునిగిపోయారు. కానీ బౌలర్ లీచ్ మాత్రం కొద్ది సేపు నిజంగానే ఇది ఔటయ్యాడా! అన్నట్లు అలానే చూస్తూ ఉండిపోయాడు. బ్యాటర్ మైదానం వదలి వెళ్లేవరకు లీచ్ ఆశ్చర్యంగా అలానే ఉండిపోయాడు. ఈఘటన సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడు టెస్టు మ్యాచ్ లో సిరీస్ లో భాగంగా ఇప్పటికే 2-0తో కివీస్ సిరీస్ కోల్పోయింది. దీంతో మూడో టెస్టులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. అయితే ప్రస్తుతం కివీస్ బ్యాటర్ హెన్రీ ఔటైన తీరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. An unfortunate dismissal? Yes. But wholly within the Laws. Law 33.2.2.3 states it will be out if a fielder catches the ball after it has touched the wicket, an umpire, another fielder, a runner or the other batter. Read the Law: https://t.co/cCBoJd6xOSpic.twitter.com/eKiAWrbZiI — Marylebone Cricket Club (@MCCOfficial) June 23, 2022