N Jagadeesan: క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్ అంటారు. అయితే.. ఒక్కోసారి ఆటలో కోపాలు, తాపాలు కామన్. కానీ.., యువ ఆటగాడు నారాయణ్ జగదీశన్ తాను ఔటైన విధానంతో సహనం కోల్పోయి.. గ్రౌండ్ లోనే అసభ్యంగా మిడిల్ ఫింగర్ చూపించడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ.. నారాయణ్ జగదీశన్ ఇలా ఎందుకు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే ప్రతి ఏటా తమిళనాడు ప్రీమియర్ లీగ్ జరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటిలా ఈ సీజన్ కూడా గురువారం రసవత్తరంగా ఆరంభమైంది. ఈ మొదటి మ్యాచ్ లో చెపాక్ సూపర్ గిల్లీస్- నెల్లయ్ రాయల్ కింగ్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన చెపాక్ సూపర్ గిల్లీస్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో.. నెల్లయ్ రాయల్ కింగ్స్ బ్యాటింగ్ కు దిగింది. ఈ జట్టు 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించగా.. భారీ లక్ష్య చేధనతో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ సూపర్ గిల్లీస్ జట్టుకి శుభారంభం లభించింది. ఆ జట్టు ఓపెనర్ నారాయణ్ జగదీశన్ మొదటి నుండే బౌండరీలతో విరుచుపడ్డాడు. అయితే.., జోరు మీద ఉన్న నారాయణ్ జగదీశన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో మన్కడింగ్ విధానంలో అవుట్ అయ్యాడు. బాబా అపరాజిత్ బౌలింగ్ వేస్తోన్న సమయంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ క్రీజ్ నుంచి కొద్దిగా బయటికి వచ్చాడు జగదీశన్. దీన్ని అదునుగా తీసుకుని బాబా అపరాజిత్ అతన్ని అవుట్ చేశాడు. Jagadeesan issues an apology later after Loses control by Mankaded In TNPL #Jagadeesan pic.twitter.com/Cu5WfbOoHM — TATA IPL 2023 | Everything 'Cricket' & #IPL2023 (@IPLnCricket) June 24, 2022 దీంతో.. జగదీశన్ సహనం కోల్పోయాడు. అవుటై పెవిలియన్కు వెళ్తున్న సమయంలో జగదీశన్ తీవ్ర అసహనంతో కనిపించాడు. ఆగ్రహావేశాలతో గ్రౌండ్ లోనే మిడిల్ ఫింగర్ను చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ జగదీశన్ పై మండిపడుతున్నారు. మన్కడింగ్ అవుట్ అనేది కూడా ఆటలో ఓ భాగం అయినప్పుడు జగదీశన్ ఇలా మిడిల్ ఫింగర్ ఎలా చూపిస్తాడు అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మరి.. ఈ విషయంలో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Video: ఇలా కూడా అవుట్ అవుతారా? ఇంత దురదృష్టవంతుడిని ఎక్కడా చూసి ఉండరు? Baba Aparajith run-out Narayan Jagadeesan for backing at the non-striker end in TNPL. pic.twitter.com/PPhMeI91tg — Johns. (@CricCrazyJohns) June 24, 2022