ఆర్జే సూర్య.. అంటే వెంటనే గుర్తు పట్టలేకపోవచ్చు.. కానీ.. కొండబాబు అనగానే ఎవరైనా సరే టక్కున గుర్తు పడతారు. మిమిక్రీ ఆర్టిస్ట్, ఆర్జేగా కెరీర్‌ని కొనసాగించిన సూర్య.. ఆ తర్వాత ఓ ప్రముఖ చానెల్‌లో కొండబాబు పాత్ర ద్వారా తెర మీదకు వచ్చాడు. ప్రసుత్తం బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా కొనసాగుతున్నాడు. ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌కు కెప్టెన్ కూడా అయ్యాడు. అయితే హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఆరోహి-సూర్యలు క్లోజ్‌గా ఉండేవారు. దాంతో వీరిద్దరూ లవర్స్ అనుకున్నారందరూ. అయితే తర్వాత సూర్యకు బయట బుజ్జిమా అనే గర్ల్‌ఫ్రెండ్ ఉన్నట్లు తెలిసింది. దీని గురించి ఓ సారి హోస్ట్ నాగార్జున బుజ్జిమా ఎవరని అడిగితే ముసి ముసి నవ్వులు నవ్వుతూ సిగ్గు పడ్డాడు. ఇక హౌస్‌లో తరచుగా బుజ్జిమా పేరు కలవరిస్తూ ఉంటాడు. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో నిర్వహించిన బ్యాటరీ రిచార్జ్ టాస్క్‌లో కూడా సూర్యకు ఇంటి నుంచి వచ్చిన లెటర్‌లో బుజ్జిమా పేరు వినిపించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ బుజ్జిమా ఎవరు అనే ఆసక్తి అందరిలో పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో తాజాగా బుజ్జిమా తెర మీదకు వచ్చింది. యూట్యూబ్ చానెల్స్‌కి వరుస ఇంటర్వ్యూలో ఇస్తూ.. ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సూర్యతో పరిచయం.. హౌస్‌లో అతడి ప్రవర్తన తదితర అంశాలపై స్పందించింది బుజ్జిమా. ఆ వివరాలు.. బుజ్జిమా అసలు పేరు మృదుల. వీరిద్దరి మధ్య అయిదారేళ్ల నుంచి పరిచయం ఉంది. మృదులా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆరోహి-సూర్యల మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని తెలిపింది. అయితే ఇనయా గురించి మాత్రం కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇనయానే సూర్య వెంట పడుతుంది అని కామెంట్ చేసింది.
ఈ సందర్భంగా బుజ్జిమా అలియాస్ మృదుల మాట్లాడుతూ..‘‘ పదేళ్ల క్రితం తొలసారి నాకు, సూర్యతో పరిచయం అయ్యింది. ముందుగా నేనే మెసేంజర్‌లో తనకు మెసేజ్ పెట్టాను. అనంతరం ఏడాది తర్వాత 2015, ఆగస్టులో మేం తొలిసారి.. ఫోరమ్ మాల్‌లో కలుసుకుని ఒకరిని ఒకరం చూసుకున్నాం. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కొనసాగుతుంది. సూర్య ముద్దుగా నన్ను బుజ్జిమా అని పిలుస్తాడు.. నేను కూడా తనను అలానే పిలుస్తాను’’ అని చెప్పుకొచ్చింది.
ఇక బిగ్‌బాస్ హౌస్‌లో సూర్య ప్రవర్తన గురించి మాట్లాడుతూ.. ‘‘ఆరోహి, సూర్యల మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే. అయితే ఆ ఫ్రెండ్‌షిప్ కాస్త ఎక్కువవడంతో అందరికీ అది తప్పుగా కనిపించింది. ఇక ఆరోహి వెళ్లగానే సూర్య డిప్రెస్ అవుతాడనుకున్నాను. కానీ ఇనయా తనకు దగ్గర అయ్యింది. అతడి వెంటే తిరుగుతుంది. పైగా సూర్య అంటే తనకు క్రష్ అని కూడా చెప్పింది. బయట చాలా మంది ఇనయా.. సూర్య మీద కాన్సన్‌ట్రేషన్ పెట్టి.. ఫెవికాల్‌లా అంటుకుని తిరుగుతుంది.. ఆటను వదిలేసింది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇనయాకు సూర్య అంటే ఇష్టం.. అందుకే అతడి వెంట పడుతోందని అర్థం అవుతోంది. కానీ సూర్య.. ఇనయా గురించి ఏమనుకుంటున్నాడో తెలియదని’’ చెప్పుకొచ్చింది బుజ్జిమా అలియాస్ మృదుల. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.