ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ గెలవడంపై తెలుగువారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆస్కార్ అవార్డుపై ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర నిర్మాత దానయ్య స్పందిస్తూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
రాజమౌళి దర్వకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు సైతం ఆర్‌ఆర్‌ఆర్‌కు దాసోహం అన్నది. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్ సాధించిన ఈ ఘనత పట్ల యావత్ దేశం మరీ ముఖ్యంగా తెలుగు వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నిర్మాత డీవీవీ దానయ్య.. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దానయ్య రాజమౌళి మీద సెటైర్లు వేశాడా ఏంటి అంటున్నారు.. అతడి మాటలు విన్న వారు. ఇంతకు దానయ్య ఆస్కార్‌పై ఏమన్నారంటే..
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి నిర్మాత డీవీవీ దానయ్య. ఎంతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. మూవీ ఘన విజయం సాధించడమే కాక.. భారీ వసూళ్లు సాధించింది. ఇక దానయ్య విషయానికి వస్తే.. ఆయన ప్రమోషన్స్‌కు చాలా దూరంగా ఉంటాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో ఆయన చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే కనిపించాడు. రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కీరవాణిలు మాత్రమే ప్రమోషన్ కార్యక్రమాల్లో అధికంగా పాల్గొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ మన దేశంలో భారీ విజయం సాధించిన తర్వాత.. దాన్ని వరల్డ్ వైడ్‌గా ప్రమోట్ చేయాలని రాజమౌళి అనుకున్నాడు. దానికోసం జపాన్, అమెరికా దేశాలలో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ట్రిపుల్ ఆర్ టీమ్ అంతా కలిసి గట్టిగా ప్రమోట్ చేశారు.
మన దేశం నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ను అధిఆకరికంగా ఆస్కార్‌కు పంపకపోయినా.. రాజమౌళి ఒక్కడే శ్రమించి.. ఆర్‌ఆర్‌ఆర్‌ను ఆస్కార్ వరకు తీసుకెళ్లడమే కాక అవార్డు సైతం గెలిచేలా చేశాడు. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్ అంటే రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కీరవాణిలు మాత్రమే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇంత భారీ బడ్జెట్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన దానయ్య పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. తాజాగా దీని గురించి దానయ్యను ప్రశ్నించగా.. ఆయన చెప్పిన సమాధానం ఫన్నీగా మాత్రమే కాక రాజమౌళిపై సెటైర్లు వేసినట్లుగా ఉంది.
మీడియా అడిగిన ప్రశ్నకు దానయ్య సమాధానం ఇస్తూ.. ‘‘నేను నిర్మించిన సినిమాకు ఆస్కార్ రావడం పట్ల చాలా గర్వంగా ఫీలవుతున్నాకను. ఇక నేను ఎప్పుడూ వెనుకే ఉంటాను.. నాకు ఫ్రంట్‌లో ఉండటం అలవాటు లేదు. అవార్డ్ వచ్చాక నేను వాళ్లకు కాల్ చేశాను. కానీ వారంతా కార్యక్రమంలో బిజీగా ఉండటంతో రెస్పాన్స్ అవ్వలేదు. నేను వాళ్లకి మెసేజ్ పాస్ చేశాను’’ అన్నాడు. దానయ్య సమాధానం విన్న వారు.. అంటే రాజమౌళికి ఫ్రంట్‌లో ఉండాలనే కోరిక ఉంటుందని సెటైరికల్‌గా అన్నాడా.. లేక తనకే ముందుకు రావడం ఇష్టం లేక ఇలా అన్నాడా.. అంటూ చర్చించుకుంటున్నారు.
కానీ ఏది ఏమైనా ఆర్‌ఆర్‌ఆర్ వరల్డ్ వైడ్ ప్రమోషన్ సందర్భంగా దానయ్య పేరు ఎక్కడా వినిపించలేదు, కనిపించలేదు అన్నది మాత్రం వాస్తవం. ఆస్కార్ ప్రమోషన్స్ అనే కాదు.. అంతకు ముందు గోల్డెన్ గ్లోబ్ కోసం చేసిన ప్రమోషన్స్, అమెరికా, జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ విడుదల చేసిన సమయంలో కూడా దానయ్య ఎక్కడా కనిపించలేదు. అయితే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి అంటున్నారు. ఏంటంటే.. దానయ్య ఆర్ఆర్ఆర్‌ని నెట్ ఫ్లిక్స్‌తో పాటు వరల్డ్ వైడ్ ప్రమోట్ చేసేందుకు సహకరించలేదని వార్తలు వచ్చాయి. దాంతో రాజమౌళినే సొంతంగా కోట్లు ఖర్చుపెట్టి ప్రమోట్ చేశాడని గతంలో గుసగుసలు వినిపించాయి. ఇవి నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. మరి దానయ్య రాజమౌళిపై సెటర్లు వేశాడా.. లేక తన గురించి చెప్పాడా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.