ఆస్కార్ వేడుకలు ముగియడంతో స్వదేశానికి చేరుకుంది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీమ్. వారికి అభిమానులు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. దీంతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం రద్దీగా మారింది.
‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ అనుకున్నది సాధించింది. సినీ ప్రపంచంలో అత్యుత్తమ అవార్డుగా భావించే ఆస్కార్‌ను అందిపుచ్చుకుంది. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిగిన పురస్కారాల వేడుకలో మహామహుల సమక్షంలో ‘నాటు నాటు’ పాటకు ఎంఎం కీరవాణి, చంద్రబోస్ అకాడమీ అవార్డును అందుకున్నారు. ఈ ఆనందంలో మూవీ యూనిట్‌కు యూఎస్‌లో ఆస్కార్ పార్టీ ఇచ్చాడు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌కు వచ్చేయగా.. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యూనిట్ విజయదరహాసంతో భాగ్యనగరానికి చేరుకుంది. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆస్కార్ పురస్కారంతో జక్కన్న, ఆయన సతీమణి రమ, కీరవాణి, కార్తికేయ, కాలభైరవ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు.
‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌తో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. రాజమౌళిని అభిమానులు చుట్టేశారు. దీంతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం మొత్తం రద్దీగా మారింది. అయితే మీడియాతో మాట్లాడకుండా జైహింద్.. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు రాజమౌళి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు హీరో రామ్ చరణ్ యూఎస్ నుంచి శుక్రవారం స్వదేశానికి రానున్నారు. అయితే ఆయన నేరుగా హైదరాబాద్‌కు రాకుండా దేశ రాజధాని న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు ఆయన అక్కడే ఉండనున్నారు. ఉదయం ‘ఇండియా టుడే కాన్క్లేవ్’లో గెస్ట్‌గా చెర్రీ పాల్గొననున్నారు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారాయన. ఆ మీటింగ్ పూర్తయిన తర్వాత ఈ రోజు రాత్రికి చెర్రీ హైదరాబాద్‌కు వచ్చే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ తెలిపారు. చరణ్‌కు ఒక రేంజ్లో గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.
#JaiHind #RRR Movie Team Back in Hyderabad After Winning #Oscar award #Rajamouli #Keeravani #RamaRajamouli pic.twitter.com/OlUCWmowdO
— Filmy Focus (@FilmyFocus) March 17, 2023