రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి సినిమాను తెరకెక్కించే విషయంలో ఎంత పకడ్బంధీగా ఉంటాడో.. సినిమాని తర్వాత ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉంటాడు. అంతేకాదు ఎంతో వినూత్నంగానూ సినిమా ప్రమోషన్స్ చేస్తుంటాడు. రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ‘RRR’ సినిమా ప్రమోషన్స్‌లోనూ రాజమౌళి తనదైన మార్క్ చూపిస్తున్నాడు. రాజమౌళి పబ్లిసిటీ స్ట్రాటజీ చూసి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఔరా అంటోంది.
అంతేకాదు వారి ప్రమోషన్ విధానం కూడా ఎంతో కొత్తగా అనిపించింది. ఎప్పుడూ అభిమానులతో రద్దీగా ఉండే థియేటర్లనే రాజమౌళి తన ప్రచార సాధనంగా వాడుకుంటున్నాడు. దేశవ్యాప్తంగా ఎంతో బ్రాండ్ ఇమేజ్ ఉన్న ‘PVR’ సినిమాస్‌తో రాజమౌళి కొలాబరేట్ అయ్యాడు. ‘RRR’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా PVRతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించారు. ప్రచారం కోసం ఏకంగా PVR బ్రాండ్‌నే మార్చేశారు. PVR-RRRని కలిపేసి ‘PVRRR’గా మార్చేశారు. అంతేకాదు ట్విట్టర్‌లోనూ ఎప్పుడూ RRR మూవీ ట్రెండింగ్‌లో ఉండే విధంగా జక్కన్న చూస్తున్నట్లు కూడా తెలుస్తోంది. దేశవ్యాప్త ప్రచారం కోసం రాజమౌళి ట్విట్టర్‌ను ఎక్కువగా వాడుతున్నట్లు భావిస్తున్నారు. ఎప్పుడు వాళ్ల సినిమాకు సంబంధించి ఒక్క హ్యాష్ ట్యాగ్ అయినా ట్రెండింగ్‌లో ఉంటోంది. అది జక్కన్న స్ట్రాటజీగానే అభివర్ణిస్తున్నారు. జనవరి 7న ‘RRR’ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.