భారతదేశంలో సినిమా పరిశ్రమకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజురోజుకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ వేల కోట్లకు పడగలెత్తుతోంది. ఇది గమనిస్తున్న కార్పోరేట్ దిగ్గజాలు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ఆలోచనలను మార్చుకుంటున్నారు. అందులో భాగంగానే థియేటర్ సంప్రదాయంలో కొత్త కొత్త పద్దతులను తీసుకొస్తున్నాయి మల్టీప్లెక్స్ యాజమాన్యాలు. పట్టణాలు, నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్ లను విమానాశ్రయాల్లోకి కూడా విస్తరిస్తున్నా కార్పోరేట్ దిగ్గజాలు. అందుకు ముందడుగు వేసింది PVR యాజమాన్యం. ఇండియాలో మెుదటిసారి విమానాశ్రయాంలో సినిమా థియేటర్ […]
మీరు సినిమా ప్రియులా! ఏ సినిమా రిలీజైన థియేటర్ కు పరుగులు పెడుతుంటారా! అయితే, ఈ వార్త మీకు ఆనందాన్నిచ్చేదే. ఎందుకంటే.. ఈ న్యూస్ ద్వారా మీరు 99 రూపాయలకే సినిమా చూసే అవకాశాన్ని పొందుతున్నారు. అది కూడా సాధారణ థియేటర్లలో కాదండోయ్. అన్ని హంగులుండే మల్టీప్లెక్స్‌లలో ఈ ధరకు సినిమా చూడొచ్చు. ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ సినిమాస్ ఈ ఆఫర్ కల్పిస్తోంది. కాకుంటే.. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే. ఈనెల 20న సినిమా ప్రేమికుల […]
వినోదాన్ని పంచె సినిమా రంగం అంటే అందరకి ఆసక్తే. కుటుంబంతో కలిసి నాలుగు గంటల పాటు హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేయొచ్చు అనిపించే ఏకైక రంగం.. సినిమా రంగమే. అందులోనూ.. కొత్తవయినా.. పాతవయినా.. సినిమాను థియోటర్లలో చూసినప్పుడే అసలైన మజా దొరుకుతుంది. ఎందుకు ఖర్చు దండగ అనుకొని.. మొబైల్/కంప్యూటర్ లో చూశారా! ఆ ఫీలింగ్ మిస్ అవుతారు. కాకుంటే.. రాను.. రాను.. టిక్కెట్ల రేట్లు అధికమవుతున్నాయి. ఎంతలేదన్నా.. సాధారణ థియోటర్లలో 100 నుంచి 150 వరకు ఉంటది. […]
రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి సినిమాను తెరకెక్కించే విషయంలో ఎంత పకడ్బంధీగా ఉంటాడో.. సినిమాని తర్వాత ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉంటాడు. అంతేకాదు ఎంతో వినూత్నంగానూ సినిమా ప్రమోషన్స్ చేస్తుంటాడు. రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ‘RRR’ సినిమా ప్రమోషన్స్‌లోనూ రాజమౌళి తనదైన మార్క్ చూపిస్తున్నాడు. రాజమౌళి పబ్లిసిటీ స్ట్రాటజీ చూసి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఔరా అంటోంది. అంతేకాదు వారి ప్రమోషన్ […]
టీ20 వరల్డ్‌కప్‌లో ఈ నెల 24 ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టేడియంలో కొన్ని వేల మంది ఈ మ్యాచ్ మజాను ఆస్వాదిస్తే.. కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతారు. కాగా ఇప్పుడు క్రికెట్ సంబరాన్ని సినిమా థియేటర్లలో కూడా ఎంజాయ్ చేయవచ్చు. టీమిండియా వరల్డ్‌లో ఆడే ప్రతి మ్యాచ్‌ను ఐనొక్స్, పీవీఆర్ మల్లీప్లెక్స్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు […]