భారీ బడ్జెట్, అంచనల మధ్య.. విడుదలైన RRR సినిమా సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. దర్శకుడు రాజమౌళి.. తనదైన శైలిలో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక సినిమాలో చరణ్, జూనియర్ పోటీ పడి మరి నటించారని.. వాళ్లిద్దరి తమ కెరీర్‌లోనే బెస్ట్ పర్‌ఫామెన్స్ ఇచ్చారని ప్రేక్షకులు, సిని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. బాహుబలి రికార్డులన్నింటిని RRR తిరగరాస్తుందని అంటున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో పాటు బాలీవుడ్ తారలు ఆలియా భట్, అజయ్‌దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు నటించారు. ఇక సినిమా కోసం వీరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే దాని గురించి ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: RRR ఆ హీరోకి నేషనల్ అవార్డు పక్కా.. ప్రముఖ విమర్శకుడి సంచలన వ్యాఖ్యలు
ఈ సినిమాకు నటీనటుల పారితోషికాలు కాకుండా.. బడ్జెటే సుమారు 336 కోట్ల రూపాయలు అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం రామ్ చరణ్‌కు రూ.25 కోట్లు, జూనియర్ ఎన్టీఆర్‌కు రూ.25 కోట్లు, ఆలియా భట్‌లకు రూ.10 కోట్లు, అజయ్ దేవగణ్‌కు రూ.10 కోట్లు, ఒలీవియా మోరిస్ కు రూ.1 కోటి, శ్రియకు రూ.కోటి, సముద్రఖనికి రూ.50 లక్షలు, మిగతా విదేశీ తారాగణానికి రూ.3 కోట్లు పారితోషికం అందిందట. ఇక రాజమౌళి రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. ఆయన లాభాల్లో వాటా తీసుకున్నారనే టాక్ వినిపిస్తుంది. మరికొందరు మాత్రం RRR సినిమా కోసం రాజమౌళి 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: RRR సినిమాపై నారా లోకేష్ ట్వీట్ వైరల్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.