విడుదలైన దగ్గర నుంచి RRR సినిమా రికార్డులను కొల్లగొట్టే పనిలోనే ఉంది. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. భారీ వసూళ్లతో రికార్డు సృష్టిస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షక లోకం ఫిదా అయ్యింది. సినిమా విడుదలైన 10 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి భారీ రేంజ్ వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలోనే భారతీయ సినిమాకే గర్వ కారణంగా నిలిచేలా.. ఓ అరుదైన ఫీట్ అందుకుంది RRR సినిమా. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: RRR సినిమాపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ సినిమాలానే మేం కూడా!
ప్రముఖ ఇంటర్నేషన్ మూవీ డేటా బేస్ సంస్థ (IMDb) సంస్థ ప్రస్తుతం బాగా పాపులర్ అయిన చిత్రాల జాబితాలో టాప్-5లో నిలిచిన ఏకైక భారతీయ సినిమాగా RRR రికార్డు సృష్టించింది. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈ లిస్ట్‌లో ఉన్న ఇతర హాలీవుడ్ సినిమాలను మించి త్రిబుల్ ఆర్‌కే రేటింగ్ రావడం విశేషం. ఇటీవల ఆస్కార్ అవార్డు సాధించిన CODA మూవీ ఈ లిస్టులో తొలి స్థానంలో నిలవగా.. డెత్ ఆన్ ది నైల్, మార్బియస్, బ్యాట్ మేన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Jr Ntrకిచ్చిన మాట నిలబెట్టుకున్న రాజమౌళి.. ఆ దర్శకుడితో కలిసి!త్రిబుల్ ఆర్ చిత్రం విడుదలయ్యి ఇప్పటికి 11 రోజులు అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, బాలీవుడ్ బాక్సాఫీస్‌ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 1000 కోట్ల క్లబ్‌కి అతి చేరువలో ఉంది. కొన్ని రోజుల్లోనే ఈ రికార్డు కూడా బ్రేక్ చేస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. అసాధారణ రికార్డు సాధించిన RRR సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: హీరో నాగశౌర్య హోమ్ టూర్.. వీడియో వైరల్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.