ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న తెలుగు పీరియాడిక్ మల్టీస్టారర్ చిత్రం RRR. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామి రేపుతోంది. రిలీజ్ మొదటి రోజునుండి పాజిటివ్ టాక్ తో RRR రోజుకో కొత్త రికార్డు సెట్ చేస్తోంది. ప్రస్తుతం సినీబృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఇక ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ యాక్టర్స్ ఇద్దరూ సినిమాకే హైలైట్ అవుతున్నారు. వారే సినిమా మొదట్లోనే కనిపించే మల్లి(ట్వింకిల్ శర్మ) అలాగే తల్లి లోకి(అహ్మరీన్ అంజుమ్). అయితే ఈ ఇద్దరు కూడా సినిమాలో కనిపించిన కాసేపైనా సాలిడ్ పెర్ఫామెన్స్ అందించారు. ఈ క్రమంలో ఇప్పుడు వీరిద్దరిది ఒక క్యూట్ సెల్ఫీ నెట్టింట వైరల్ అవుతోంది.
లోకి పాత్రలో నటించిన అహ్మరీన్ అంజుమ్, ట్వింకిల్ తో కలిసి కాస్ట్యూమ్స్ లో దిగిన క్యూట్ సెల్ఫీని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలో అంజుమ్, ట్వింకిల్ ఇద్దరు కూడా కెమెరాకు కన్ను కొడుతూ ఇచ్చిన ఫోజ్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ ఫోటో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినీ ప్రేక్షకులు వీరి నటనకు మెచ్చి కామెంట్స్ లో కొనియాడుతున్నారు. మరి మల్లి, లోకిల సెల్ఫీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Loki & Malli ❤️@ssrajamouli @aliaa08 @ajaydevgn @alwaysramcharan @tarak9999 @DVVMovies @RRRMovie @PenMovies #rrrmovie #roarrringblockbuster #actor #actress #behindthescenes #vanitydiaries #bollywood #tollywood #historyofindiancinema #gloryofindiancinema #loki #malli pic.twitter.com/Lywm7ON66J
— Ahmareen Anjum (@AhmareenAnjum) March 30, 2022