టాలీవుడ్ వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎల్లప్పుడూ ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటాడు. దాదాపు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో దర్శకుడిగా, నిర్మాతగా కొనసాగుతున్న వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతూ వచ్చాడు. అయితే.. వర్మ ఎలాంటి సినిమాలు చేసినా, ఎన్ని కాంట్రవర్సిలలో నిలిచినా క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే వస్తోంది.
ఇక వర్మ సినిమాల విషయానికి వస్తే.. ఏడాదిలో లెక్కలేనన్ని సినిమాలు అనౌన్స్ చేస్తాడు.. కానీ అవన్నీ తెరమీదకు రావనే సంగతి తెలిసిందే. వర్మ తీసే సినిమాలన్నీ కాంట్రవర్సీలకు దారి తీస్తుంటాయి. తాజాగా స్టార్ కన్నడ యాక్టర్ ఉపేంద్రతో ఓ ఫ్యాక్షన్ సినిమా ప్రకటించి అందరికి షాకిచ్చాడు వర్మ. ‘R’ అనే టైటిల్ తో.. ఇండియన్ క్రిమినల్ హిస్టరీలోని ఓ గ్యాంగ్ స్టర్ లైఫ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు వర్మ.
మరి ఉపేంద్ర ఫస్ట్ లుక్ వీడియో అయితే అరాచకంగానే ఉంది. ఉపేంద్ర కత్తిని ముద్దాడుతున్న ఇంటెన్స్ తీరులో వర్మ మార్క్ కనిపిస్తోంది. అయితే.. ఇది ఎవరి లైఫ్ ఆధారంగా తెరకెక్కనుంది అనేది సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉండగా.. ఉపేంద్రతో వర్మ సినిమా ఉంటుందని తెలుసు. కానీ వీరిద్దరికి పొత్తు ఎలా కుదిరింది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఉపేంద్ర – రాంగోపాల్ వర్మ ‘R’ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.