తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. అల్లూరి సితారామ రాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా, కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇక వీరితో పాటు ఇందులో బాలీవుడ్ నటులైన ఆలియా భట్, అజయ్ దేవగణ్ నటిస్తుండగా డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలు, పోస్టర్స్ సినీ అభిమానులకు తెగ ఆకట్టుకుంటున్నాయి.
కాగా సినిమా విడుదలకు ఇక కొన్ని రోజులు మిగిలి ఉండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్ లో బిజీ బిజీగా ఉంది. మరో విషయం ఏంటంటే..? తాజాగా ఈ సినిమాలోని ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైంది. అయితే ఎన్టీఆర్ పోషించిన కొమరం భీమ్ పాత్రలోని కొన్ని సన్నివేశాలను మూవీ యూనిట్ మేకింగ్ వీడియోగా రూపొందించి తాజాగా ఇన్ స్ట్రా గ్రామ్ లో విడుదల చేసింది. రిసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మేకింగ్ నెట్లింట్లో హల్చల్ చేస్తుంది.