బాలీవుడ్ సెలబ్రిటీల గురించి ఏదొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. వారి వ్యక్తిగత జీవితం, వారి ప్రేమ, పెళ్లి ఇలా ప్రతి విషయాన్ని నెట్టింట వైరల్ చేస్తుంటారు. వాటిలో నిజాలు కన్నా గాసిప్స్, పుకార్లే ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఓ గాసిప్ ఇప్పుడు బీటౌన్ లోనూ హల్చల్ చేస్తోంది. సల్మాన్ ఖాన్- సోనాక్షి సిన్హాకు వివాహం జరిగింది అని. ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు అందులో నిజమెంత? అవి నిజమైన ఫొటోలేనా? అ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పెళ్లంటే ఆవడ దూరం పారిపోయే సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్నాడా? అంటూ అంతా ఆశ్చర్యపోయారు. నిజానికి అది నిజం కాదు. అవును ఆ ఫొటోలు మార్ఫింగ్ చేసినవి. మార్ఫింగ్ చేసిన ఫొటోలతో సల్మాన్ ఖాన్- సోనాక్షి వివాహం జరిగిందంటూ పుకార్లు పుట్టించారు. ఆర్య- సయ్యేషా వివాహం నాటి ఫొటోలను అలా వాడుకున్నారనమాట. ఆర్య ప్లేస్ లో సల్మాన్- సయ్యేషా ప్లేస్ లో సోనాక్షిలను పెట్టి నెట్టింట వైరల్ చేశారు. అప్పుడు ఆర్య వివాహం జరిగినప్పుడు కంటే.. ఇప్పుడు సల్మాన్ ఖాన్- సోనాక్షి మార్ఫిగ్ లతోనే ఆ ఫొటోలు ఎక్కువ వైరల్ అయ్యాయి. అందరూ మళ్లీ ఒకసారి ఆర్య వివాహం ఫొటోలను ఇప్పుడు చెక్ చేస్తున్నారు. వైరల్ చేయడానికి ఏమైనా చేసేస్తున్నారు. ఈ పుకారుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.