గత మూడేళ్లు కరోనా కారణంగా ఐపీఎల్ మ్యాచ్ లను స్టేడియంలో ఎంజాయ్ చేయలేకపోయారు. డిజిటల్ స్క్రీన్ లో మ్యాచ్ లను చూసినప్పటికీ.. నేరుగా స్టేడియమ్ లో పాల్గొని చూస్తే ఆ కిక్కే వేరుంటుంది. మహమ్మారి పోయాక మొదటిసారి మళ్లీ ఐపీఎల్ మ్యాచులు స్టేడియమ్ లలో ఫ్యాన్స్ తో కళకళలాడబోతున్నాయి. ఈసారి ఐపీఎల్ మ్యాచులు మాత్రం ఇండియాలోనే జరగబోతున్నాయి. అంతేగాక స్టేడియమ్ లన్నీ జనాలతో కిటకిటలాడేలా టికెట్స్ అమ్మకాలు జరగనున్నాయట. ఇక 2023 ఐపీఎల్ ప్రారంభ వేడుకలను మరింత ఉత్సాహవంతం చేసేందుకు వైడ్ సినీ తారలు వేడుకలో పాల్గొనబోతున్నారని సమాచారం.
వరల్డ్ వైడ్ క్రికెట్ కి వీరాభిమానులు ఎలా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఇండియాలో క్రికెట్ అంటే.. పిచ్చిగా ఆదరించేస్తారు. వరల్డ్ కప్ లో వేరే దేశాలతో ఇండియా పోటీ పడితేనే.. ఊహించని రేంజ్ లో ఫాలో అవుతూ.. తమ అభిమానాన్ని చాటుకుంటారు. అదే ఐపీఎల్ విషయానికి వచ్చేసరికి.. ఆదరాభిమానాలు పీక్స్ కి చేరుకుంటాయి. గత మూడేళ్లు కరోనా కారణంగా ఐపీఎల్ మ్యాచ్ లను స్టేడియంలో ఎంజాయ్ చేయలేకపోయారు. డిజిటల్ స్క్రీన్ లో మ్యాచ్ లను చూసినప్పటికీ.. నేరుగా స్టేడియమ్ లో పాల్గొని చూస్తే ఆ కిక్కే వేరుంటుంది. మహమ్మారి పోయాక మొదటిసారి మళ్లీ ఐపీఎల్ మ్యాచులు స్టేడియమ్ లలో ఫ్యాన్స్ తో కళకళలాడబోతున్నాయి.
గత మూడు ఐపీఎల్ సీజన్స్ కి ఇండియాలో అనుమతి లేకపోవడంతో విదేశాలలో నిర్వహించారు. ఈసారి ఐపీఎల్ మ్యాచులు మాత్రం ఇండియాలోనే జరగబోతున్నాయి. అంతేగాక స్టేడియమ్ లన్నీ జనాలతో కిటకిటలాడేలా టికెట్స్ అమ్మకాలు జరగనున్నాయట. ఇక 2023 ఐపీఎల్ ప్రారంభ వేడుకలను అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ క్రికెట్ స్టేడియంలో మొదలు పెట్టనున్నారట. ఈ వేడుకలను మరింత ఉత్సాహవంతం చేసేందుకు ఇండియా వైడ్ సినీ తారలు సైతం వేడుకలో పాల్గొనబోతున్నారని సమాచారం. ఈసారి సెలబ్రిటీలు హాజరవ్వడమే కాదు.. తమ ఆటపాటలతో ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో ఐపీఎల్ ప్రారంభోత్సవానికి.. బాలీవుడ్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, వరుణ్ దావన్, పరిణీతి చోప్రా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లతో పాటు సౌత్ నుండి స్టార్ హీరోయిన్స్ తమన్నా, రష్మిక మందాన కూడా పాల్గొనబోతున్నారు. అంతేగాక వీరిద్దరూ.. స్టేజ్ పై అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫార్మన్స్ లతో కన్నులవిందు చేయనున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి సౌత్ సినీ ఫ్యాన్స్ అందరూ ఖుషి అవుతున్నారు. దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. ఈ వేడుకల కోసం ఏర్పాట్లు మాత్రం భారీ స్థాయిలో జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి మొన్నటి మూడు ఐపీఎల్ సీజన్లను మిస్ అయిన క్రికెట్ ఫ్యాన్స్ కి.. ఇది ఖచ్చితంగా ఉత్సాహాన్నిచ్చే అప్ డేట్ గానే చెప్పుకోవాలి. మరి 2023 ఐపీఎల్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Rashmika Mandanna And Tamannaah Bhatia Set To Perform At The IPL 2023 Opening Ceremony#Cricket #RashmikaMandanna #TamannaahBhatia #IPL #IPL2023 #cricketnews pic.twitter.com/KaHPrJA9pS
— Dil Hai Cricket – Subrata Biswas (@dilhaicricket) March 23, 2023