వెండితెరపై హవా నడిపిస్తున్న హీరోయిన్లలో రాశి ఖన్నా ఒకరు. ‘మద్రాస్ కేఫ్’ వెబ్‌సిరీస్‌తో హిందీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో నటించి మంచి క్రేజ్ కొట్టేసింది. మొదట బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ ఈ మధ్య స్లిమ్ లుక్ లోకి మారి మరింతగా అట్రాక్ట్
చేస్తోంది. నిన్నమొన్నటి వరకూ కెరియర్ విషయంలో నిదానమే ప్రధానం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇటీవల జోరు పెంచింది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో సత్తా చాటుతున్న రాశి ఖన్నా చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉండగా, తమిళంలో అరడజను సినిమాల వరకూ ఉన్నాయి. ఈ సినిమాలన్నీ కూడా విభిన్నమైనవే!. పెద్ద బ్యానర్లలో నుంచి వచ్చేవే.
ఇక హిందీ వెబ్ సిరీస్ లోను ఈ సుందరి బిజీగానే ఉంది. రీసెంట్ గా ప్రభాస్ ప్రాజెక్టులోను అవకాశాన్ని అందుకుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ఆయన ‘ఆది పురుష్’ ప్రాజెక్టు పైకి రానున్నాడు. ఆ వెంటనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మాణం జరుగుతుందని భోగట్టా. కీలకమైన పాత్రల కోసం వివిధ భాషల నుంచి నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఆల్రెడీ అమితాబ్, దీపికా పదుకొణే పేర్లు ఖాయమైపోయాయి. ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం రాశి ఖన్నాను తీసుకున్నారనేది తాజాగా వినిపిస్తోంది. సో …ఇప్పుడీ అందాల రాశి కి సినిమాల రాసి కూడా ఎక్కువే అవుతున్నాయి.