రమ్యకృష్ణ.. అలా అనడం కంటే శివగామి అంటేనే తెలుగు ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడతారేమో. సెంకడ్ ఇన్నింగ్స్ ని కూడా ఎంతో పవర్ ఫుల్ గా లీడ్ చేస్తోంది. మొన్నీ మధ్య వచ్చిన లైగర్ సినిమా వరకు కూడా మంచి డైనమిక్ రోల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.
రమ్యకృష్ణ.. ఈ సీనియర్ హీరోయిన్ కు ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ శివగామిగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ప్రభాస్-రానా లాంటి స్టార్ హీరోలకు తల్లిగా మంచి పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. నటన పరంగా రమ్యకృష్ణకు ఎప్పుడూ పోటీలేదు. పదహారణాల తెలుగమ్మాయి గానూ నటించింది. బికినీ వేసి కుర్రకారును ఉక్కిరిబిక్కిరి కూడా చేసింది. మరోవైపు లేడీ ఓరియంటెడ్ పవర్ ఫుల్ క్యారెక్టర్లలో కూడా నటించి మెప్పించింది. ఆ రోజుల్లో అయితే రమ్యకృష్ణ అందం, అభినయం, నటనకు భక్తులు ఉండేవారు. అప్పట్లో రమ్యకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి స్వయంగా తాను ఇచ్చిన 1998 ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
1998 సంవత్సరం రమ్యకృష్ణ కెరీర్ లో ఎంతో ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఊయల, కంటే కూతుర్నే కను, దీర్ఘసుమంగళీ భవ, చంద్రలేఖ, లవ్ స్టోరీ 1999 వంటి అద్భుతమైన సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఆ ఇయర్ వచ్చన ఈ సినిమాలు ఎంత ఫేమస్సో ఆ సమయంలో రమ్యకృష్ణ ఇచ్చిన ఓ సెన్సేషనల్ ఇంటర్వ్యూ కూడా అంతే ఫేమస్. రమ్యకృష్ణ ముక్కుసూటి మనిషి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదున్నా కూడా మొహమాటం లేకుండా పైకి చెప్పేస్తారు. ఆ రోజుల్లో అలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రమ్యకృష్ణ ఎంతో బోల్డ్ సమాధానాలు చెప్పారు.
సె*క్స్ బాంబ్ అని పేరు రావడంపై ఆ ఇంటర్వ్యూలో స్పందించారు. “నన్ను సె*క్స్ బాంబ్ అంటున్నారు అంటే అది కేవలం తెర వరకు మాత్రమే పరిమితం. నిజ జీవితంలో కూడా అలాగే ఎందుకు ఉంటాను. నేను అన్నింటికి సిద్ధంగా ఉన్నాను. అందరికీ అందుబాటులో ఉన్నాను అనుకుంటే అది వారి తెలివి తక్కువతనం. ఎవరు ఏమనుకున్నా నేను బాధపడను. నేనేంటో నాకు తెలుసు. నన్ను అలా పిలవడంపై గర్వపడుతున్నాను. ఇండస్ట్రీలో ఎవరికి వచ్చే పేరు వారికి వస్తుంది. జనం నన్ను సె*క్స్ బాంబ్ అంటుంటే ఎంతో సెక్సీగా ఫీలవుతాను” అంటూ రమ్యకృష్ణ ఓపెన్ కామెంట్స్ చేశారు.
పెళ్లి విషయంపై ప్రశ్నించగా.. “అందరిలా నేను సినిమా వాడిని చేసుకోను వంటి కబుర్లు చెప్పను. నేను ఒక మగాడిని ప్రేమించడం జరిగితే.. అతను సినిమా రంగానికి చెందిన వాడైనా కూడా నాకు అభ్యతరం లేదు. కానీ, నాకు ఒకే ఒక అభ్యంతరం ఉంది. అతను పెళ్లైన వ్యక్తి కాకూడదు. పెళ్లాం, పిల్లలు ఉన్న వాడిని పెళ్లాడి వారికి ద్రోహం చేయడం.. అన్యాయం అని నా ఉద్దేశం.” నానా పాటేకర్ తో సంబంధం అంటూ వచ్చిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. “నానాకూ నాకు సంబంధం అంటగట్టడం వల్ల నాకేం నష్టం జరగలేదు. మా ఏం ఉందీ.. ఏం లేదు అని సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అయినా నా వ్యక్తిగత జీవితం నాది. ఇతరుల మాటలూ, చేతలు, రాతలు నా జీవితాన్ని మార్చలేవు” అంటూ రమ్యకృష్ణ వ్యాఖ్యానించారు.
రమ్యకృష్ణ ఇచ్చిన సెన్సేషనల్ ఇంటర్వ్యూ (1998) 💝 pic.twitter.com/ubxkTQm6gz
— Ravindranath Sriraj (@ravindraraj11) February 12, 2023