రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వినగానే ఎక్కడి లేని వివాదాలు అన్నీ మన మైండ్ లోకి వచ్చేస్తాయి. అందుకేనేమో.. స్టార్ డైరెక్టర్ నుంచి వివాదాస్పద డైరెక్టర్ అనే పేరును సొంతం చేసుకున్నారు. నా గురించి ఎవరు ఏం మాట్లాడుకున్నా నేను పట్టించుకోను అనే వర్మ.. ఎదుటి వారి గురించి కూడా కొన్నిసార్లు అలాగే మాట్లాడతారు. ఆయన పొగిడారో తిట్టారో తెలియాలంటే కాస్త పట్టిద్ది మరి. డైరెక్టర్స్ డే రోజు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను ఆకాశానికి ఎత్తేస్తూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు చేశారు. అయితే ఆ ట్వీట్లలో ప్రశాంత్ నీల్ ను వీరప్పన్ పోలుస్తూ.. F*** పదాలు విచ్చలవిడిగా వాడేశాడు. మరోవైపు సినిమా ఇండస్ట్రీ, డైరెక్టర్లకు గట్టిగా వడ్డించాడు. అసలు రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పాలనుకున్నాడు? ఆ ట్వీట్ల సారాంశం ఏంటో చూద్దాం.
I wish a very UNHAPPY Directors day to @prashanth_neel for so royally FUCKKKKING every directors mind everywhere whether it’s in BOLLYWOOD, TOLLYWOOD,KOLLYWOOD and even in SANDALWOOD ..Sir Prashant Neel, U are the VEERAPPAN of indian cinema🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) May 4, 2022
‘ప్రశాంత్ నీల్ గారికి వేరీ అన్ హ్యాపీ డైరెక్టర్స్ డే. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాకుండా శాండిల్ వుడ్ డైరెక్టర్లకు సైతం మైండ్ పోగొట్టారు.(మధ్యలో కొన్ని అభ్యంతరకర పదాలు ఉన్నాయి.) ఇండియన్ సినిమాకి మీరు వీరప్పన్ లాంటి వారు.
Sir @prashanth_neel u made a quintal of money but that at the cost of indian film industry losing 100’s of tonnes of money becos they will all spend on reshoots, redrafts,rethinks in reinventing themselves,but not knowing why the fucking fuck KGF 2 worked 😳#UnhappyDirectorsDay
— Ram Gopal Varma (@RGVzoomin) May 4, 2022
మీరు కేజీఎఫ్ సినిమా నుంచి క్వింటాళ్ల కొద్ది డబ్బు చేసుకున్నారు. కానీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్టీర వందల టన్నుల సొమ్మును లాస్ అవుతోంది. వారిని వారే కొత్తగా చూపించుకునేందుకు సినిమాలను రీ షూట్, రీ డ్రాఫ్ట్స్, రీ థింక్స్ చేస్తున్నారు. కానీ, అయినా వారికి కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఎందుకు వర్కౌట్ అయ్యిందో అర్థం కాని పరిస్థితి.
95% of the tradition oriented conventional film industry people have hated KGF 2 and that itself is the proof that @prashanth_neel has kicked out the old industry and brought in a new industry ,which is the #Kgf2 industry
— Ram Gopal Varma (@RGVzoomin) May 4, 2022
ప్రశాంత్ నీల్ పాత సినిమా ఇండస్ట్రీని పక్కకు తోసి.. కేజీఎఫ్ 2 అనే కొత్త ఇండస్ట్రీకి శ్రీకారం చుట్టారని చెప్పేందుకు.. 95 శాతం ట్రెడిషన్ ఓరియంటెడ్ కన్వెన్షనల్ ఇండస్ట్రీ జనాలు కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాని వ్యతిరేకించడే ఉదాహరణ’ అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల పర్వం సాగింది. ఇక్కడ ప్రశాంత్ నీల్ ను పొగుడుతూ ఇండియన్ సినిమాని తిడుతూ, కొత్త ఇండస్ట్రీ వచ్చిందని చెబుతూ రామ్ గోపాల్ వర్మ తన భావాలను ట్వట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ ట్వీట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి. రామ్ గోపాల్ వర్మ ట్వీట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.