రామ్ గోపాల్ వర్మ.. ఇండియన్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని దర్శకుడు. ఒకప్పుడు.. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ని శాసించిన దర్శకుడుగా నిలిచాడు. అగ్ర హీరోలందరూ వర్మతో సినిమా చేయాలని ఉవ్విళ్లూరేవారు. ఇక ముక్కుసూటిగా.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వర్మ స్టైల్. ఎవరేమనుకుంటే నాకేంటి.. ఐ డోంట్ కేర్ అనుకునే మనస్తత్వం వర్మది. ఆ లక్షణమే ఆయనను నిత్యం వార్తల్లో నిలిచేలా చేస్తోంది. అయితే ఒకప్పుడు ఇండియన్ సినిమా గర్వించే స్థాయి సినిమాలు తీసిన వర్మ.. ఆ తర్వాత పూర్తిగా అందుకు వ్యతిరేకమైన సినిమాలు తీస్తున్నాడు. ఇక నిత్యం ఏదో ఓ కాంట్రవర్సీ కామెంట్ చేస్తూ.. వార్తల్లో నిలవడం అంటే వర్మకు చాలా సరదా. ఈ క్రమంలో తాజాగా వర్మ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. తానేం తేడా వ్యక్తి కాదని.. కానీ ఓ హీరోని చూస్తే ఓ ఫీలింగ్ వస్తోందంటూ తన మనసులోని వింత కోర్కెను వెల్లడించాడు వర్మ. ఆ వివరాలు..
దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బ్రూస్ లీ అంటే ఎంత అభిమానమో అందరికి తెలిసిన సంగతే. అతడి మీద అభిమానంతోనే ఆర్జీవీ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడు. ఇక బ్రూస్ లీ మీద తన అభిమానాన్ని పలు సందర్భాల్లో వెల్లడించాడు కూడా. ఆ ఇష్టంతోనే వర్మ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో లడికి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో పూజా భలేకర్ హీరోయిన్గా నటించింది. మొట్టమొదటి ఇండో చైనీస్ మూవీగా రూపొందిన ఈ సినిమా జూలై 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘‘బ్రూస్ లీ అంటే నాకు చాలా ఇష్టం. తెర మీద, రియల్ లైఫ్‌లో కూడా నేను ఆయన అభిమానిని. ఇప్పుడు ఓ ఆసక్తికర అంశం చెప్పబోతున్నాను. అది వినగానే నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను తేడా వ్యక్తిని కాను.. కానీ నాకు బ్రూస్ లీని చుంబించాలనే కోరిక బలంగా ఉండేది. ఆయనలో ఏదో ప్రత్యేకత ఉండేది. అది కేవలం అతను పంచ్ విసిరే విధానంలో మాత్రమే కాక.. ఆయన కళ్లలో, స్క్రీన్ మీద కనిపించే విధానంలో, పర్సనాలిటీలో ఆ ప్రత్యేకత కనిపించేది. తన పంచ్‌లకు ఆడియెన్స్ కూడా అలానే స్పందించేవారు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన నేను మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాను.’’ అంటూ వర్మ తన మనసులోని కోరికను బయట పెట్టాడు. వర్మ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.