RGV: వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాల ప్రచారం కోసం ఏమైనా చేస్తుంటాడు. ఎల్లప్పుడూ ఏదోక కాంట్రావర్సీతో వార్తల్లో నిలిచే వర్మ.. ప్రస్తుతం తాను తెరకెక్కించిన 'కొండా' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. కొండా సురేఖ, మురళీ జీవితాల ఆధారంగా తెరకెక్కించిన `కొండా` ఈ నెల 23న విడుదల కాబోతుంది. త్రిగుణ్, ఇర్రామోర్ కొండా దంపతుల పాత్రలలో నటించారు. ఇక శనివారం హైదరాబాద్లో కొండా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కొండా దంపతులు అతిథులుగా పాల్గొన్న ఈ ఈవెంట్లో వర్మ తనలోని డ్యాన్సర్ ని బయటపెట్టి హైలైట్ గా నిలిచారు. ఈ చిత్రంలో ప్రజాగాయకుడు గద్దర్ పాడే పాపులర్ పాట `పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా` అనే పాటని రీక్రియేట్ చేశారు. ఈ పాటను వర్మ తన స్టయిల్లో మార్చుకుని పాడటం విశేషం. సినిమాలోని ఈ పాటని ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజిపై ప్రదర్శించారు. ఈ పాటకు స్వయంగా వర్మనే డ్యాన్స్ చేశాడు. ప్రమోషన్స్ లో వర్మ డాన్స్ చేయడమనేది కొత్త కాదు. కానీ ఈసారి చేతిలో గన్ను పట్టి, ఎర్రటి టవల్ ధరించి, టోపీ పెట్టి డాన్సర్లతో కలిసి చేసిన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. తనదైన స్టయిల్లో స్టెప్పులు, ఎక్సప్రెషన్స్ పలికిస్తూ అందరిని నవ్వించాడు. ప్రస్తుతం వర్మ డాన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. మరి వర్మ డాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.