ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయిన రామ్ చరణ్ పై ఒత్తిడితో పాటు బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలో నటించారు. అలాంటి గొప్ప సినిమా తర్వాత చేయబోయే సినిమాలు కూడా అంతే గొప్పగా ఉండాలి. ఎలాంటి సినిమా చేయబోతారా అనుకున్న సమయంలో భారతదేశం గర్వించే దర్శకులు శంకర్ తో సినిమా చేయబోతున్నారని అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇక చెర్రీ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. శంకర్ డైరెక్షన్ లో సినిమా అంటే ఈ దెబ్బతో చరణ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని భావిస్తున్నారు. మరి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వాలంటే.. దానికి తగ్గట్టే శ్రమించాలి. అందుకే చరణ్.. ఏకంగా సెట్స్ లోనే కసరత్తులు చేయడం మొదలుపెట్టారు.
కియారా అద్వానీ హీరోయిన్ గా, ఎస్జే సూర్య కీలక పాత్రలో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఆర్సీ15 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. విదేశీ లొకేషన్స్ లో పాటల చిత్రీకరణ జరుపుతారని వార్తలు వస్తున్నాయి. అయితే దీని కంటే ముందు ఒక షెడ్యూల్ ని పూర్తి చేయనున్నారు. అయితే షూటింగ్ సెట్స్ లోనే జిమ్ సెటప్ ఏర్పాటు చేసుకుని మరీ.. ట్రైనర్ పర్యవేక్షణలో వర్కవుట్లు చేస్తున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ లో షూటింగ్ జరుగుతుంది. అక్కడే దేశీ జిమ్ సెట్ చేసుకుని.. దేశీ జిమ్ ఎక్విప్మెంట్స్ తో ఎండలో బరువులు ఎత్తుతూ, రన్నింగ్, స్విమ్మింగ్ చేస్తూ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ షేర్ చేస్తూ.. ‘నా అప్ కమింగ్ షెడ్యూల్ కోసం అంతా సిద్ధంగా ఉంది. వర్కవుట్ కి సెలవు లేదు’ అంటూ రాసుకొచ్చారు. షూటింగ్ ఉన్నా, లేకపోయినా వర్కవుట్లు చేస్తూనే ఉంటారట రామ్ చరణ్. హీరోలన్నాక ఆ మాత్రం కమిట్మెంట్ ఉండాలి. రామ్ చరణ్ అంటే మినిమమ్ ఉంటాది.