తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్దికాలానికే గ్లామరస్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్ లో కూడా రాణిస్తోంది. ఈ పంజాబీ భామకి తెలుగులో అవకాశాలు లేకపోయేసరికి ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టింది. ప్రస్తుతం రకుల్ చేతిలో 6 హిందీ సినిమాలు, 3 తమిళ సినిమాలు, 1 తెలుగు సినిమా చేస్తూ బిజీగా ఉంది.
ఇదివరకు రొటీన్ స్టోరీలతో, రొటీన్ పాత్రలతో ప్రేక్షకులను పలకరించిన రకుల్.. ప్రస్తుతం కెరీర్ ని చాలా సీరియస్ గా తీసుకొని.. బయట ఇండస్ట్రీలో పోటీని దృష్టిలో పెట్టుకొని సినిమాలు ప్లాన్ చేసుకుంటుంది. మొన్నటిదాకా గ్లామర్ పరంగా, రొమాన్స్ పరంగా హద్దులు పెట్టుకున్న రకుల్.. ప్రస్తుతం అలంటి హద్దులు ఏమి పెట్టుకోలేదని.. సినిమా కోసం ఏమైనా చేసేందుకు రెడీ అనేస్తోంది.ఒకపక్క హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్ లో కూడా కాలు కదుపుతోంది. ఇటీవలే ఓ షాకింగ్ రోల్ ఓకే చేసి ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురిచేసింది రకుల్. కండోమ్ బిజినెస్ నేపథ్యంలో ఛత్రివాలి అనే సినిమా ఓకే చేసింది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Who run the world? Let’s just say #Chhatriwali (iykyk) ☔#WomensDay@Rakulpreet @tejasdeoskar @soniakanwar22 @eshaan_phadnis @ronniescrewvala pic.twitter.com/PkTvsLufoV
— RSVP (@RSVPMovies) March 8, 2022
ఈ పోస్టర్ చూస్తుంటే.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల లాగా కాకుండా ప్రయోగాత్మకంగా కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత రకుల్ కూడా రూట్ మార్చి బోల్డ్ రోల్స్ ఓకే చేస్తోందని బాలీవుడ్ సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమాలో బ్యాడ్ కంటెంట్ లేదని అంటోంది రకుల్. ఒక సాధారణ మహిళ కండోమ్ బిజినెస్ లో అడుగుపెట్టి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసింది అనేది సినిమా మెయిన్ పాయింట్ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉండవని, రకుల్ కండోమ్ టెస్టర్ రోల్ చేస్తుందని ఇండస్ట్రీ టాక్. మరి రకుల్ బోల్డ్ రోల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.