డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ మృతి సినీ పరిశ్రమలోని ఆయన శిష్యులు, డ్యాన్స్ మాస్టర్లకే గాక, ఆయనతో పనిచేస్తున్న యూట్యూబర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమాల్లో అవకాశాలు రాకపోయినా, షోల్లో నటించకపోయిన.. తనకంటూ ఓ యూట్యూబ్ స్టార్ చేసి
డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ మృతి సినీ పరిశ్రమలోని ఆయన శిష్యులు, డ్యాన్స్ మాస్టర్లకే గాక, ఆయనతో పనిచేస్తున్న యూట్యూబర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమాల్లో అవకాశాలు రాకపోయినా, షోల్లో నటించకపోయిన.. తనకంటూ ఓ యూట్యూబ్ స్టార్ చేసి.. సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారితో కలిసి వీడియోలు చేస్తూ మరింత పాపులర్ అయ్యారు. విజయనగరంలో షూటింగ్ నిమిత్తం వెళ్లిన ఆయన అక్కడ విపరీతంగా మద్యం సేవించారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురై గాంధీ ఆసుపత్రిలో కన్ను మూశారు. ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్ బోరబండలోని తమ మామ సమాధి పక్కనే రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుమారుడు చైతన్య తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే ఆయన చనిపోవడానికి కారణం యాసిడ్ అని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆయన సోదరుడు, ఆశ్రమ గురువు స్పందిస్తూ.. కొంత మంది బూమ్ బూమ్ (మద్యం) బీర్, మాన్సన్ హౌస్ వంటివి చంపేశాయని కామెంట్లు వచ్చాయని, దాన్ని తాను ఏకీభవిస్తున్నానని తెలిపారు. విజయనగరంలో షూటింగ్ సమయంలో మితిమీరిన శ్రమ చేయడంతో పాటు ఆహారం కూడా సరిగ్గా తీసుకోలేదని, అలాగే ఏకథాటిగా కారులో ప్రయాణించడం వల్ల శరీరం డీ హైడ్రేషన్‌కి గురయ్యిందని తెలిపారు. హైదరాబాద్ వచ్చేటప్పుడు ‘ సింహం వస్తుందన్న’అని కాల్ చేశారని అన్నారు. అలాగే త్వరలో ఆయన కుటుంబానికి దగ్గర కాబోతున్నాన్న ఆనందం వ్యక్తం చేస్తూ ఆశ్రమానికి వచ్చి తన ఆశీస్సులు తీసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత రూమ్‌కు వెళ్లి రెండో రోజు తనకు బాగోలేదని ఫోన్ చేశారని, తనకు వాంతులు అవుతున్నాయని చెప్పగానే.. వెళ్లి మెడిసన్ ఇస్తే తగ్గిందని అన్నారు.
గతంలో రాకేష్ మాస్టర్‌కు జాండీస్ వచ్చాయని, ఏమన్నా రిపీట్ అయ్యిందేమోనని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించి, వేరే పనికి మీద బయటకు వెళ్లాలని.. తిరిగి అడిగితే.. మద్యానికి దూరంగా ఉండాలని చెప్పారన్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వాంతులు అవుతున్నాయని చెప్పగా.. డాక్టర్ మందులు వేసుకోవాలని సూచించానన్నారు. అయితే నిర్లక్ష్యం చేశారని చెప్పారు. తర్వాత తనకు తెలిసిన విషయమేమిటంటే.. అతనితో ఉన్న యూట్యూబర్లు మందు పోయించి.. రెచ్చగొట్టి సెలబ్రిటీలను తిట్టించేవారని తెలిపారు. ఆయనకు బాగోని సమయంలో కూడా మద్యం పోయించారని చెప్పారు. దారి తప్పిన యూట్యూబర్లు ఇదంతా చేశారని ఎమోషనల్ అయ్యారు. ఇక చనిపోయే రోజు తానే అన్నం తినిపించాలని వెళ్లాలని, కానీ అచేతన స్థితిలో పడిపోయి.. నోటి వెంట రక్తం కారిందని చెప్పారు.
వెంటనే 108కి మొబైల్‌కి ఫోన్ చేస్తే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ‘నన్ను రక్షించండి రా, నన్ను కాపాడండిరా’ అంటూ రాకేష్ ఆవేదన చెందాడని ఏడ్చేశారు. మామిడి పళ్లు కూడా తినడంతో షుగర్ పెరిగిపోయిందని, బీపీ లెవల్స్ తగ్గిపోయానని డాక్టర్లు చెప్పేశారని, ట్రీట్ మెంట్‌లో హార్ట్ స్ట్రోక్స్ చేసే అవకాశం ఉందని చెప్పారన్నారు. కడుపులో ఆక్సిజన్ పెడుతున్న సమయంలో డాక్టర్లు భయపడి.. ఇది యాసిడ్ తాగిన కేసు కదా అన్నారన్నారు. లోపల నల్లగా ఉండటంతో అలా అభిప్రాయ పడ్డారని, అయితే అలా అనద్దని చెప్పానని.. చివరకు అలాంటిదేమీ లేదని వైద్యులు నిర్ధారించారని తెలిపారు. భార్య ఆసుపత్రికి రాగానే కళ్లు తెరిచి చూశాడని, ఆయన చనిపోతాడని ఊహించానని అన్నారు.