హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ ఎలాగో ముంబైలో జుహు ఏరియా అలా అన్న మాట. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, బిజినెస్ మేన్‌లు ఉండే లగ్జరీ ఏరియా జుహు. ఇక్కడ ఇల్లు ఉండడాన్ని ఒక స్టేటస్ సింబల్‌లా భావిస్తారు. అందుకే ఎంత ఖర్చయినా సరే కొనేసి లగ్జరీ ఇంటిని సొంతం చేసుకుంటారు. అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, అలియా భట్ వంటి స్టార్లు జుహులోనే నివసిస్తున్నారు. తాజాగా ఈ జుహు ఏరియాలో ఒక ఇంటివారైపోయారు మరో స్టార్. ఆయనే ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు.
విలాసవంతమైన, ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ఈ ఇంటి కోసం రూ. 44 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. 3456 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఆ ఇంటిని.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ నుంచి కొనుగోలు చేశారు. జూలై 21న రిజిస్ట్రేషన్ జరగగా.. రాజ్‌కుమార్ రూ. 2.19 కోట్లు స్టాంప్ డ్యూటీని చెల్లించారు. ఇక ఇదే ఇంటిని జాన్వీకపూర్ 2020లో 39 కోట్లకు కొని, 78 లక్షలతో రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఇప్పుడు ఈ ఇంటిని తన కో స్టార్ అయిన రాజ్‌కుమార్ రావుకి అమ్మేసింది.
రాజ్‌కుమార్ రావు ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఏడాదికి చేతి నిండా సినిమాలతో రూ. 8 కోట్లకు పైగా సంపాదిస్తున్నారని అంచనా. సినిమాల ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా.. పలు కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇక రాజ్‌కుమార్ రావు, జాన్వీ కలిసి ‘రూహీ’ అనే సినిమాలో నటించారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.