బిగ్ బాస్.. హాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ కాన్సెప్ట్ ఇండియాలో సూపర్ సక్సెస్ అయ్యింది. భారతదేశంలో ప్రారంభమైన ప్రతి భాషలో బిగ్ బాస్ కాన్సెప్ట్ కు మంచి ఆదరణ లభించింది. అలాగే తెలుగులోనూ 5 సక్సెస్ఫుల్ సీజన్లను కంప్లీట్ చేసుకుని ఆరో సీజన్‌కు సిద్ధమవుతోంది. మరోవైపు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కూడా ఒకటి దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. భాష ఏదైనా ఈ బిగ్ బాస్ ఎంతో మందిని సెలబ్రిటీలను చేసింది. ఈ బిగ్ బాస్ లో పాల్గొని వచ్చిన వారంతా బయట స్టార్లుగా కొనసాగుతున్నారు. అదే హిందీలో అయితే వీళ్లకు మరీ క్రేజ్ ఎక్కువ. ఈ షో నుంచి హీరోలు, హీరోయిన్లు అయిన వారు ఉన్నారు. వీళ్లు ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. తాజాగా పెళ్లిపై హిందీ బిగ్ బాస్ బ్యూటీ షెహనాజ్ గిల్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి. Ab saare aao, Aur mere sangg naacho… watch me perform at Umang on 6th Aug at 9:30pm on @SonyTV pic.twitter.com/W3SfLtS17p — Shehnaaz Gill (@ishehnaaz_gill) July 28, 2022 బిగ్ బాస్‌లో బొద్దుగా ఉన్న షెహనాజ్ గిల్ ఆ తర్వాత ఫిట్నెస్ మీద దృష్టి పెట్టి సన్నగా.. నాజూగ్గా మారిపోయింది. మ్యూజిక్ ఆల్బమ్స్ తో ఫేమస్ అయిన షెహనాజ్ బిగ్ బాస్ తర్వాత మరింత మందికి చేరువైంది. ‘మసాబా మసాబా’ వెబ్ సిరీస్ సీజన్ 2 ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ భామకు అభిమాని ఓ ఇంట్రస్టింగ్ ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. తనని పెళ్లి చేసుకోవాలంటూ ప్రపోజ్ చేశాడు. Once a King, always a King BB G.O.A.T Sidharth Shukla….samajh mein aaya na? #SidharthShukla pic.twitter.com/6gnmA1PUqS — Shehnaaz Gill (@ishehnaaz_gill) January 30, 2022 ఫ్యాన్ ప్రపోజల్‌కు షెహనాజ్ గిల్ ఆసక్తిగా సమాధానం చెప్పింది. “మీరు ప్రపోజల్ పెట్టారు సరే.. మీ బయోడేటా కూడా నాకు పంపండి. నాతో జీవించడం అంత ఈజీ కాదు. ఎదుటివారు చెప్పేది వినేంత సహనం, ఓపిక నాకు లేదు. 24 గంటలు యినా నేను మాట్లాడుతూనే ఉంటాను. నేను చెప్పేది మీరు వినాలి. మధ్యలో నా గురించి మాట్లాడుతూ ఉండాలి. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా నాతో ఎక్కువ కాలం ఉండలేరు. ఒక వేళ మీరు నన్ను పట్టించుకోలేదంటే మాత్రం.. నేను మధ్యలోనే వెళ్లిపోతాను. అందుకే నాతే పెళ్లిలాంటి కలలు కనకండి” అంటూ షెహనాజ్ ఫ్యాన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. ఈ బ్యూటీ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: చాలా రోజుల తర్వాత కూతురితో కల్యాణ్ దేవ్.. వీడియో వైరల్! ఇదీ చదవండి: చేతిలో కర్పూరం వెలిగించుకుని.. స్టేజ్‌పైనే తాళి కట్టేసిన జబర్దస్త్ నూకరాజు!