స్టైల్ లో గానీ, డైలాగ్ డెలివరీలో గానీ రజినీకాంత్ ని బీట్ చేసే హీరో ఎవరూ లేరు. అందుకే 72 ఏళ్ల వయసులో కూడా సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. అయితే సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా రజినీ మాట్లాడే మాటలు వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తాజాగా రజినీకాంత్ మాట్లాడిన స్పీచ్ ఒకటి వైరల్ అవుతోంది.
రజినీకాంత్ ఈ పేరు ఒక సెన్సేషన్. 72 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలతో సమానంగా నటిస్తున్నారు. హిట్స్, ప్లాప్స్ పక్కన పెడితే తెర మీద రజినీకాంత్ ఉంటే చాలు ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి. ఆ స్టైల్ కి, ఆ యాటిట్యూడ్ కి ఏ వయసు వారైనా అభిమాని అవ్వాల్సిందే. రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రజినీకాంత్ క్రేజ్ దృష్ట్యా తమిళనాడు, బెంగళూరులోని కొన్ని ఆఫీసులు సెలవులు ప్రకటించాయి. ఉచితంగా టికెట్లు కూడా ఇస్తున్నాయి. అదీ రజినీకాంత్ క్రేజ్ అంటే. అయితే దారిలో ఏనుగు నడుస్తున్నప్పుడు కుక్కలు మొరగడం సహజం. రజినీకాంత్ ని అభిమానించే వారే కాదు.. ఆయనను విమర్శించే మనుషులు కూడా ఉంటారు.
ఇటీవల కాలంలో ఆయన మీద విమర్శలు, ట్రోల్స్ ఎక్కువైపోయాయి. ఇటీవల జైలర్ మూవీ ఆడియో ఫంక్షన్ చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడారు. ఆ మాటలే ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆయన ఏం మాట్లాడారు అంటే.. ‘మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మన పని మనం చేసుకుపోతూ ఉండాలి. అర్థమైందా రాజా’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ ఒకటి చెప్పారు. ఈ డైలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన జీవితంలో ఎదురైన పరిస్థితులను వివరిస్తూ మాట్లాడిన ఈ డైలాగ్ కి ఆడిటోరియం విజిల్స్, చప్పట్లతో దద్దరిలిపోయింది. అయితే రజినీకాంత్ ఈ మాటలు తమిళంలో అన్నప్పటికీ అందరికీ అర్థమయ్యేలా ఉన్నాయి.
ఈ డైలాగ్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఈ డైలాగ్ జైలర్ సినిమాలో ఉంటే నిజంగా ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఈ సినిమాలో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్, తమన్నా, రమ్యకృష్ణ, సునీల్, యోగిబాబు వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తమన్నా ఆడి పాడిన ‘నువ్ కావాలయ్యా’ పాట అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఒకవైపు తమన్నా పాట, మరోవైపు రజినీ మాస్ స్పీచ్ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తున్నాయి. మరి అర్థమైందా రాజాపై అంటూ 72 ఏళ్ల వయసులో రజినీకాంత్ పేల్చిన మాటల తూటాలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Man at the age of 70 stood for an hour straight and gave exhilarating speech 🙏🤌
That ‘ Ardhamiyyinddha Raja ‘ at the end 💥💥#Rajinikanth #Jailer #Thalivar @rajinikanth pic.twitter.com/O5Kb9Warz2
— Rebel (@RebelTweetts) August 8, 2023