Raghava Lawrence: సౌత్‌లో టాలెంటెడ్ సినిమా పర్సన్ అని ఎవరి గురించైనా ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే.. రాఘవ లారెన్స్ ముందు వరుసలో ఉంటారు. సైడ్ డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన నేడు హీరోగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు.. డ్యాన్స్ మాస్టర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా బహుముఖ ప్రతిభను చాటుకున్నారు. సినిమాలే కాదు.. సేవారంగంలోనూ ఆయన ముందుంటున్నారు. అవసరమైన వారికి సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం లారెన్స్ చంద్రముఖి 2 సినిమాలో నటిస్తున్నారు. ఇది రజనీకాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖికి కొనసాగింపు. ప్రస్తుతం చంద్రముఖి 2 చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు లారెన్స్. తన నటనతో పాటు బాడీలో కూడా వేరియేషన్స్ ఉండాలని భావించారు.
ఈ మేరకు కండలు పెంచేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఫొటోలతో పాటు ఓ నోట్‌ను కూడా జత చేశారు. ‘‘ అందరికీ హాయ్. నేను మీతో ఓ రెండు విషయాలు పంచుకుందాం అనుకుంటున్నాను. మొదటిది.. చంద్రముఖి 2 కోసం చిరు ప్రయత్నంగా నా బాడీని మార్చుకున్నాను. ఇందుకు కారణమైన నా ట్రైనర్ శివ మాస్టర్‌కు కృతజ్ఞతలు. నాకు మీ దీవెనలు కావాలి. రెండో విషయం… నా ట్రస్ట్‌కు ఇన్ని రోజులుగా మద్దతు ఇస్తున్న దాతలకు కృతజ్ఞతలు. మీరు నా వెన్నంటే ఉన్నారు. నాకు తోచినంత నేను చేశాను. అవసరం వచ్చినపుడు అడిగి మరీ మీ నుంచి సహాయం చేయించుకున్నాను.
నేను ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాను. చాలా సినిమాలకు సంతకాలు కూడా చేశాను. ఇకపై నా సొంతంగా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నాను. అందుకే! మీరు నా ట్రస్ట్‌కు ఇకపై డబ్బులు పంపవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీ ఆశ్సీస్సులు నాకు చాలు. మీరు ఇన్నేళ్లుగా నాకు అందిస్తున్న ప్రేమ, మద్దతుకు రుణపడి ఉంటాను. త్వరలో కృతజ్ఞతా సభ ఏర్పాటు చేస్తాను. నా గుండె లోతుల్లోంచి మీ అందరికీ నా కృతజ్ఞతలు’’ అని అన్నారు. మరి, రాఘవ లారెన్స్ ఎమోషనల్ నోట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Hi everyone! I want to share a small update about Chandramukhi 2 and my trust! pic.twitter.com/jLPrVm7q3N
— Raghava Lawrence (@offl_Lawrence) September 13, 2022
ఇవి కూడా చదవండి : Ashu Reddy: డైమండ్ నెక్లెస్ కొనుక్కున్న అషు రెడ్డి.. ధర ఎంతంటే?