బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి గురించి సినిమాల్లో మాదిరి ఇంట్రడక్షన్ సీన్ అవసరం లేదు. ఎందుకంటే ఈమె ఇంట్రో సీన్ ఆల్రెడీ అభిమానుల హార్ట్ హాల్లో ఎప్పుడో పడిపోయింది. ఇప్పుడు ఇంటర్వెల్ సీన్ నడుస్తోంది. ఇంటర్వెల్ ముందు వరకూ అందాల ఆరబోతతో ఫ్యాన్స్ కి కుండపోతగా చెమటలు పట్టించారు. బిగ్ బాస్ షోతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన అషు రెడ్డి.. యాంకర్ గా పలు షోస్ లో చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. రెగ్యులర్ గా ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆమె బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోను షేర్ చేశారు. ఇప్పటికే ఆమె తన తండ్రి నుండి లగ్జరీ బెంజ్ కారుని బహుమతిగా పొందిన విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు.
అషు రెడ్డికి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చిన తండ్రి.. ధర ఎంతంటే?
తండ్రి ఇచ్చిన బహుమతితో అషు రెడ్డి సర్ప్రైజ్ అయ్యారు. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. తండ్రి ఇచ్చిన కారు ఖరీదు రూ. 70 లక్షలు ఉంటుందని సమాచారం. అయితే ఎవరి నుంచి ఎంత కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్నప్పటికీ.. ఆడవారికి మెడలో ఆభరణమే కదా అందం. కాబట్టి అషు రెడ్డి తన అందమైన బోసి మెడకి మరింత అందాన్ని తెచ్చేందుకు డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నారు. బర్త్ డే అన్నాక షాపింగ్ అనేది ఖచ్చితంగా చేస్తారు. తన బర్త్ డే షాపింగ్ ని డైమండ్ షాప్ లో చేశారు అషు రెడ్డి. నేరుగా డైమండ్ దుకాణానికి పోయి.. అక్కడున్న మోడల్స్ లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని రూ. 7.5 లక్షలతో డైమండ్ నెక్లెస్ ను సొంతం చేసుకున్నారు.
ఈ నెక్లెస్ లో ఆమె యువరాణిలా మెరిసిపోతున్నారు. ఆ నెక్లెస్ ధరించి ఆమె మోస్ట్ ఎగ్జైట్మెంట్ ఫీలవుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ని వీడియోగా తీసి తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అషు రెడ్డి మెడ.. ఆ డైమండ్ నెక్లెస్ కే అందం తెచ్చిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి అషు రెడ్డి మెడలో డైమండ్ నెక్లెస్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి.