బహుమతులు అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్దవారయ్యాక పుట్టినరోజు నాడు బైక్, కారు వంటి ఖరీదైన బహుమతులను ఇస్తుంటారు. ఇలాంటి ఖరీదైన బహుమతులు తల్లిదండ్రుల నుంచి పొందినప్పుడు పిల్లల్లో కలిగి సంతోషం చెప్పలేనిది. అయితే ఇలాంటి బహుమతులు వచ్చిన సందర్భంలో సెలబ్రిటీల్లో సైతం సంతోషంలో మునిగిపోతారు. ప్రస్తుతం బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి అలాంటి ఆనందంలోనే ఉన్నారు. అషు రెడ్డి పుట్టిన రోజుకు ఆమె తండ్రి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చారు.’ఈ సంవత్సరంలో నేను అందుకున్న సర్ ఫ్రైజ్ బహుమతి ఇదే.. ” అంటూ కారుతో ముందు దిగిన పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అషురెడ్డి ఒకరు. అనంతరం బుల్లితెరపై అనేక షోల్లో పాల్గొన్ని తనదైన యాక్టింగ్ తో మంచి గుర్తింపు సంపాదించింది. బుల్లితెరపై తన అందం, అభినయంతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసింది. అనంతరం బిగ్ బాస్ లో పాల్గొన్ని మిగిలిన సభ్యులకు గట్టి పోటీని ఇచ్చింది ఈ అమ్మడు. ఇక అక్కడి నుంచి వచ్చిన అనంతరం ఫుల్ ఫేమస్ అయింది. కొందరు ఈ అమ్మడిని జూనియర్ సమంత అని కూడా పిలుస్తున్నారు. అదే విధంగా ఈమె వివాదల దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీంతో అషు బేబి ఓ రేంజ్ లో వార్తలో నిలించింది. షోలతో బిజిగా ఉంటూనే సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన కు సంబంధించిన ఫోటోలు వీడియోలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. తాజాగా ఖరీదైన కారుతో దిగిన వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసుకుంది.
సెప్టెంబర్ 15 అషు రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా అషు తండ్రి.. ఆమెకు ఖరీదైన మెర్సిడీజ్ బెంజ్ కంపెనికి చెందిన C200D అనే మోడల్ కారును బహుమతిగా ఇచ్చారు. తండ్రి ఇచ్చిన సడెన్ సర్ ఫ్రైజ్ కి ఈ అమ్మడు షాక్ అయ్యింది. తండ్రితో కలిసి ఆ కారు ముందు ఫోటోలు దిగింది. ఈ సందర్భంగా ఇద్దరు ఒకరికొకరు స్వీట్ తినిపించుకున్నారు. ‘ఈ సంవత్సరంలో నేను అందుకున్న సర్ ఫ్రైజ్ బహుమతి ఇది” అంటూ ఫోటోలను తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది. దీంతో అందరు అషు రెడ్డి బర్త్ డే విషేష్ తెలిపారు. అయితే అషు రెడ్డి పుట్టిన రోజు బహుమతిగా వచ్చిన ఆ మెర్సిడీజ్ కంపెనీ కారు ఖరీదు దాదాపు రూ.70 లక్షలు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం అషు రెడ్డి కారుతో దిగిన పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. అషుకి ఆమె తండ్రి బర్త్ డే గిఫ్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి