టీనేజ్ లోనే సినిమాలలో అడుగుపెట్టి స్టార్డమ్ అందుకున్న హీరోయిన్స్ చాలా అరుదుగా కనిపిస్తుంటారు. కెరీర్ ప్రారంభంలోనే సూపర్ క్రేజ్ సొంతం చేసుకొని యాపిల్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది హన్సిక. ముంబైకి చెందిన ఈ భామ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి.. టాలీవుడ్ లో అల్లు అర్జున్ సరసన ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్ గా డెబ్యూ చేసింది. ఇక డెబ్యూ మూవీనే బ్లాక్ బస్టర్ అయ్యేసరికి అమ్మడు వెనక్కి తిరిగి చూసుకునే వీలులేకుండా స్టార్ హీరోలతో సినిమాలు చేసేసింది. అయితే.. పూరి జగన్నాథ్ హీరోయిన్ అంటే ఎలా గ్లామరస్ గా ఉంటారో.. కొద్దికాలానికే గ్లామరస్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది హన్సిక.
ఇక మొదటి నుండి గ్లామర్ షో పరంగా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయకుండా వస్తున్న హన్సిక.. మధ్యలో వరుస ప్లాప్స్ కారణంగా కొంతకాలం తెలుగు తెరపై కనిపించకుండా పోయింది. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ హన్సిక స్టార్ హీరోయిన్ హోదా సొంతం చేసుకుంది. ఆ మధ్య కోలీవుడ్ హీరోతో లవ్ లో పడిందంటూ వార్తలు వచ్చాయి. కానీ.. అవేవి నిజం కాదని కొట్టిపారేసింది. ఈ క్రమంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన హన్సిక.. ఈ ఏడాది మహా అనే సినిమాతో 50 సినిమాలు పూర్తిచేసుకుంది. అయితే.. తాజాగా సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న యాపిల్ బ్యూటీ.. తన స్కిన్ టైట్ అవుట్ ఫిట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఉల్లిపొరను తలపించే డ్రెస్ లో హన్సిక అందాలన్నీ టాప్ టు బాటమ్ వీనులకు విందు చేసింది. ఓవైపు థైస్ చూపుతూనే.. మరోవైపు క్లీవేజ్ షోతో సెగలు రేపింది. ప్రస్తుతం సైమా వేడుకలో హన్సికకు సంబంధించి ఫోటోలు, ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. సైమా ప్రారంభమై పది సంవత్సరాలు పూర్తవడంతో ‘ఎక్సెలెన్స్ ఆఫ్ డికేడ్’ అవార్డును హన్సికను వరించడం విశేషం. దీంతో అమ్మడి ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి. ఇక కెరీర్ పరంగా హన్సిక చేతిలో ఇప్పుడు 7 సినిమాలకు పైగా ఉన్నాయి. వాటిలో రెండు తెలుగు సినిమాలు.. మిగతావన్నీ తమిళ సినిమాలు కావడం గమనార్హం. మరి హన్సిక లేటెస్ట్ అవుట్ ఫిట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.