నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కీర్తి సురేష్.. మొదటి సినిమాతోనే తన క్యూట్ లుక్స్ తో, నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానటి వంటి సినిమాల్లో నటించారు. మహానటి సినిమాతో మహానటి సావిత్రిని గుర్తుచేసిన కీర్తి సురేష్.. ఇక కేవలం డీగ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితమవుతుందని అనుకున్నారు. కీర్తి సురేష్ గ్లామర్ షోకి పనికిరాదు, ఎప్పటికీ గ్లామర్ క్వీన్ కాలేదు అని వెక్కిరించిన నెగిటివ్ ఫ్యాన్స్ కళ్ళు పేలిపోయేలా ఆమె గ్లామర్ రోల్స్ లో కూడా నటించారు. నితిన్ హీరోగా నటించిన ‘రంగ్ దే’ సినిమాలో రొమాంటిక్ సీన్ లో నటించి నెగిటివ్ ఫ్యాన్స్ కున్న నెగిటివ్ మైండ్ సెట్ ని ఇసిరి అవతల పడేశారు.
నటి అంటే అన్ని రకాల పాత్రలు చేయాలి కాబట్టి అటు గ్లామరస్ రోల్స్, ఇటు డీగ్లామరస్ రోల్స్ చేస్తూ క్లాసు, మాస్ ఆడియన్స్ ని సంతృప్తి పరుస్తున్నారు. మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి సినిమాలకి కాంట్రాస్ట్ గా సర్కారు వారి పాట సినిమా ఉంటుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ మునుపెన్నడూ లేని విధంగా హాట్ లుక్స్ తో, ఘాటు ఎక్స్ ప్రెషన్స్ తో పిచ్చెక్కిస్తారు. పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ హీరోయిన్స్ అంత ఎక్స్ పోజింగ్ చేయకపోయినా కూడా తనకున్న పరిధిలో గ్లామర్ టచ్ ఇస్తూ అభిమానుల్ని సంతృప్తి పరుస్తూ వస్తున్నారు. కేవలం కంటెంట్ ని, డీగ్లామర్ రోల్స్ ని మాత్రమే నమ్ముకుంటే పనవ్వదని ఆమె అప్పుడప్పుడు కొంచెం హాట్ గా కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు. ట్రెండ్ కి అనుగుణంగా తనను తాను గ్లామర్ క్వీన్ గా మలచుకుంటున్న కీర్తి సురేష్.. కిల్లింగ్ లుక్స్ తో కనిపిస్తూ మరోసారి ఉక్కిరిబిక్కిరి చేశారు.
బ్లాక్ ప్యాంట్, బ్లాక్ టాప్.. పైన రంగుల జాకెట్ ఒకటి ధరించి గాలి ఆడేందుకు ఓపెన్ గా వదిలేశారు. అయితే ఆమె అలా వదిలేసినందుకు ఇప్పుడు అభిమానులకు గాలి ఆడడం లేదు. నటన గ్రామర్ అయితే, అందం గ్లామర్ కాబట్టి.. నటులకి గ్లామర్, గ్రామర్ రెండూ ఉండాలన్న నియమం కీర్తి సురేష్ కి బాగా వంటబెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె గత కొన్ని రోజులుగా గ్లామరస్ గా, ట్రెండ్ కి తగ్గట్టు మోడ్రన్ ఔట్ ఫిట్స్ తో కనువిందు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె మరోసారి అల్ట్రా స్టైలిష్ వేర్ లో కనిపిస్తూ సెగలు పుట్టిస్తున్నారు. మరి కీర్తి సురేష్ లేటెస్ట్ గ్లామరస్ లుక్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.