ఈ మధ్యకాలంలో టాలెంట్ ఉన్నవారు స్టార్స్ అవ్వడానికి సోషల్ మీడియా ఒక మంచి ప్లాట్ ఫామ్ అనే చెప్పాలి. ఏ రంగంలో టాలెంట్ ఉన్నా.. కొంచం కొత్తగా చూసేవారికి కనువింపు కలిగితే సపోర్ట్, ఫాలోయింగ్ వాటంతటవే వస్తుంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజన్స్ మెప్పు పొందగలిగితే ఎవరైనా సెలెబ్రిటీలే. ఎందుకంటే.. సోషల్ మీడియా లేని సమయంలో కష్టాలు పడి కనుమరుగైపోవడం వేరు. అలా ఎందరో ఏవేవో రంగాలలో టాలెంట్ ప్రూవ్ చేసుకునే క్రమంలో.. తగిన గుర్తింపు లభించక ఆయా రంగాలను వదిలి వెళ్లిన సందర్భాల గురించి కూడా విన్నాం. కానీ.. ఇప్పుడున్న టెక్నాలిజీ, సోషల్ మీడియాను సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా సెలెబ్రిటీ ఫేమ్ సంపాదించుకునే ఛాన్స్ ఉంది.
ఇక డాన్స్ లో తన ప్రతిభ చాటుకోవాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది గాజువాక బస్ కండక్టర్ ఝాన్సీ. ఓవైపు కండక్టర్ జాబ్ చేస్తూగుర్తింపు .. మరోవైపు డాన్సర్ గా చేసిన ప్రయత్నాలకు, హార్డ్ వర్క్ కి దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఝాన్సీకి గుర్తింపు లభించింది. గతంలోనే పలు ప్రముఖ డాన్స్ షోలలో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఝాన్సీ.. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ షోలో చేసిన ‘పల్సర్ బైక్’ పెర్ఫార్మన్స్ ఒక్కసారిగా ఝాన్సీని స్టార్ ని చేసేసింది. అప్పటినుండి ఎక్కడ చూసినా ఝాన్సీ పేరే వినిపిస్తోంది.. ఝాన్సీ వీడియోలే వైరల్ అవుతుండటం విశేషం.
ఈ క్రమంలో పెళ్లికి ముందే డాన్సర్ గా ప్రూవ్ చేసుకోవాలి అనుకున్న ఝాన్సీకి.. పెళ్లి జరిగిపోయి, కండక్టర్ గా స్థిరపడిన పదేళ్లకు గుర్తింపు అనేది ఆలస్యంగా జరిగిందని చెప్పాలి. ఇక ఎప్పుడైతే ఝాన్సీ పల్సర్ బైక్ సాంగ్ చేసిందో.. అప్పటినుండి ఝాన్సీ ఇంటర్వ్యూలతో పాటు ఆమె గతంలో చేసిన డాన్స్ పెర్ఫార్మన్సులు కూడా తిరగేస్తున్నారు నెటిజన్స్. కొన్నేళ్ల కిందటే తీన్మార్, డాన్సింగ్ స్టార్, రంగం 2 లాంటి టీవీ షోలలో ఝాన్సీ టాలెంట్ ని చూడవచ్చు. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు అందరూ ఝాన్సీని గుర్తిస్తున్నారు.. కానీ, ఎన్నో యేళ్ళనాటి ఆమె కృషి, కష్టానికి ఇప్పుడిప్పుడే ప్రతిఫలం అందుకుంటోంది. ఇక ఇంటర్ పూర్తయిన వెంటనే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఝాన్సీకి.. ఆమె చేసే ప్రతి పనిలో తన భర్త అండగా ఉంటూ వస్తున్నాడని చెప్పింది.
ఈ నేపథ్యంలో భర్త, గురువు(రమేష్ మాస్టర్) సపోర్ట్ తో ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పిన ఝాన్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుడ్ న్యూస్ బయటపెట్టింది. తనకు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తదుపరి సినిమాలో బంపర్ ఆఫర్ ఇచ్చాడని చెప్పి సర్ప్రైజ్ చేసింది. తనలో ఓ డైనమిక్ డాన్సర్ ని గుర్తించి సంపూ తదుపరి సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఆఫర్ చేసినట్లు స్వయంగా ఝాన్సీనే చెప్పడం విశేషం. సోషల్ మీడియా ద్వారా ఝాన్సీ గురించి విని, ఆమె టాలెంట్ చూసిన సంపూర్ణేష్ బాబు.. ఆమెకు ఫోన్ చేసి సినిమాలో ఐటమ్ సాంగ్ ఆఫర్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడ ఝాన్సీ టాలెంట్ తో పాటు సంపూ మంచి మనసు కూడా జనాలకు తెలుస్తుంది. ఈ లెక్కన కండక్టర్ ఝాన్సీని డాన్సర్ గా సినిమాలో చూడబోతున్నారు ఫ్యాన్స్, ప్రేక్షకులు. మరి ప్రస్తుతం ట్రెండ్ సృష్టిస్తున్న గాజువాక కండక్టర్, డాన్సర్ ఝాన్సీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.