Madhavan: సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమాల గురించి బయట టాక్, రివ్యూలు ఎలా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు కొందరు స్టార్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉందనేది గమనిస్తూ ఉంటారు. ఇక ఫ్యాన్స్, నెటిజన్స్ ఆ విడుదలైన సినిమా గురించి పాజిటివ్ గా చర్చించుకుంటుంటే తెగ సంబరపడిపోతారు. అదే నెటిజన్స్ నెగటివ్ గా మాట్లాడితే సరేలే అనుకుంటారు.
ఇవేవి కాకుండా కొత్తగా విడుదలైన సినిమాల గురించి కొత్తగా కామెంట్స్ ఏమైనా వినిపించినా, కనిపించినా షాక్ అవుతుంటారు. తాజాగా హీరో మాధవన్ అలాంటి సంఘటనే ఎదురైంది. ఇటీవలే మాధవన్ నటించి, దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ’ మూవీ విడుదలై పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే.. రాకెట్రీ మూవీ విడుదలైన అన్ని చోట్లా మంచి టాక్ తో దూసుకుపోతుంది.
ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజెన్ రాకెట్రీ మూవీ చాలా బాగుందని, ముఖ్యంగా క్లైమాక్స్ మళ్లీ మళ్లీ రిపీట్ చేసి చూశానని.. అలాగే మాధవన్ అద్భుతంగా నటించాడని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. దీంతో థియేటర్లో సినిమా చూస్తే మళ్లీ మళ్లీ క్లైమాక్స్ రిపీట్ చేసి ఎలా చూస్తారనే సందేహంతో.. అసలు విషయం అర్థమై మాధవన్ ఆ నెటిజెన్ ట్వీట్ కి రిప్లై ఇచ్చాడు. ‘క్లైమాక్స్ ని మళ్లీ మళ్లీ రిపీట్ చేసి ఎలా చూశావ్?” అని మాధవన్ అడిగిన ప్రశ్నకు స్పందించకుండా ఆ నెటిజెన్ ట్వీట్ డిలీట్ చేశాడు.
ప్రస్తుతం మాధవన్ కి, సదరు నెటిజెన్ కి మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఆ నెటిజెన్ చేసిన ట్వీట్ ని కొందరు స్క్రీన్ షాట్ తీసి పోస్టులు పెట్టడంతో.. ఆ నెటిజెన్ పైరసీలో మూవీ చూశాడని, అదీగాక విషయాన్నీ ఇక్కడే షేర్ చేశాడని, ఇలాంటి వాళ్ళవల్లే సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మరి మాధవన్ కి, నెటిజెన్ కి మధ్య జరిగిన ట్వీట్స్ సంభాషణ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.