‘ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుంది’.. ఒకప్పుడు ఈ సామెతని నిరూపించేవారు. ప్రస్తుతం మాత్రం ప్రియుడితో కలిసి భర్తని చంపిన భార్య, భర్త హత్య కోసం భార్య భారీ స్కెచ్ లాంటి వార్తలు రోజూ చూస్తున్నాం. అయితే ఈ కాలంలో కూడా భర్త కోసం త్యాగం చేసే భార్య ఉండటం చాలా అరుదు. ఒకవేళ అలా ఉంటే మాత్రం అతడి కంటే అదృష్టవంతుడు మరొకడు ఉండడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొంటున్నాం అంటే… పంచ్ ప్రసాద్ తెలుసుగా. కామెడీ టీవీ షోల్లో చేస్తుంటాడు. ఇప్పుడు అతడికి చాలా పెద్ద కష్టం వచ్చింది. ఇక్కడ అందరూ కూడా ప్రసాద్ కి వచ్చిన కష్టం గురించే మాట్లాడుకుంటున్నారు తప్పించి.. అతడికి తోడునీడగా నిలిచిన భార్య కష్టాన్ని గుర్తించట్లేదు. ఈ ఆర్టికల్ ఆమె కోసమే ప్రత్యేకంగా రాస్తున్నాం.
ఇక విషయానికొస్తే.. పంచ్ ప్రసాద్ పంచ్ వేశాడంటే మీరు కచ్చితంగా నవ్వుతారు. అందరినీ నవ్వుతూ ఆయుష్షు పెంచే అతడికి కిడ్నీ ఫెయిల్యూర్ అనే పెద్ద సమస్య ఉంది. అలా అని కుమిలిపోలేదు. దాని గురించి చెబుతూ చాలాసార్లు కామెడీ కూడా చేశాడు. ప్రసాద్ లైఫ్ గురించి చెప్పుకుంటూ పోతే అదో సినిమాలా అనిపిస్తుంది. ఎందుకంటే నటుడిగా ఎదుగుతున్న ప్రసాద్.. సునీతని చూసి ఇష్టపడ్డాడు. వెంటనే వాళ్ల పేరేంట్స్ తో కూడా మాట్లాడాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో పెద్దలు ఎంగేజ్ మెంట్ కూడా చేశారు. అయితే అప్పుడే ప్రసాద్ కు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్ బయటపడింది. మొదట్లో చిన్న సమస్యే అనుకున్నారు. కానీ కిడ్నీలు పాడయ్యాయని, విషయం సీరియస్ అని డాక్టర్లు చెప్పారు. దీంతో ప్రసాద్ కి తను ఇక బతకనని తెలిసిపోయింది.
దీంతో సునీతకు తనతో పెళ్లి చేసుకోవద్దని ప్రసాద్ ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె మాట వినలేదు. ఇరు కుటుంబ సభ్యులు కూడా చాలా చెప్పి చూశారు. కానీ ఆమె.. వాళ్లెవరి మాట వినలేదు. ఎందుకంటే ప్రేమకు ఉన్న పవర్ అలాంటిది. ప్రసాద్ ని చూడగానే తన లైఫ్ పార్ట్ నర్ ఇతడనేనని మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది. అలా ప్రసాద్ హెల్త్ కండీషన్ సీరియస్ గా ఉన్నప్పటికీ.. అతడినే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా తన కోసం చాలా కష్టాలు పడిందని ప్రసాద్ గతంలో సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పాడు. హాస్పిటల్ లో తను ఐసీయూలో ఉన్నప్పుడు ఆమె ఎనిమిది నెలల నిండు గర్భిణి అని ప్రసాద్ చెప్పాడు. అలానే ఒకానొక టైంలో ప్రసాద్-భార్య ఇద్దరూ కూడా చనిపోదామనుకున్నారు. అలాంటి టైంలో ‘జబర్దస్త్’ ఫ్యామిలీ వాళ్లను అదుకుంది. ప్రసాద్ ఆర్థికంగా, హెల్త్ పరంగా నిలబడేలా చేసింది. ఈ విషయాన్ని కూడా ప్రసాదే స్వయంగా చెప్పాడు. ఓసారి షోలో మాట్లాడుతూ.. ప్రసాద్ కి కిడ్నీ ఇవ్వడానికి కూడా ఆమె రెడీ అయింది. కాకపోతే పిల్లాడు పెద్దయిన తర్వాత.. ఇది జరుగుతుందని కమెడియన్ ఆటో రాంప్రసాద్.. ప్రసాద్-సునీతల విషయం గురించి బయటపెట్టాడు.
ఇదిలా ఉండగా ఎప్పటికప్పుడు డయాలసిస్ చేయించుకునే ప్రసాద్ కు తాజాగా మరో కష్టం వచ్చి పడింది. నడుము వెనక భాగం నుంచి కుడి కాలి వరకు చీము పట్టేసింది. దీంతో నడవలేని సిట్చూయేషన్ వచ్చింది. ఓవైపు చిన్నపిల్లాడు, మరోవైపు కదల్లేని స్థితిలో భర్త.. ఇది కాకుండా ఇంటిని చూసుకోవాలి. వీటన్నింటిని కరెక్ట్ గా మేనేజ్ చేస్తూ వస్తున్న ప్రసాద్ భార్య సునీత నిజంగా చాలా గ్రేట్. చెప్పాలంటే పంచ్ ప్రసాద్ కి దొరికిన దేవత ఆమె.. కష్టానికి అందరూ కచ్చితంగా సెల్యూట్ చేసి తీరాల్సిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న పలువురు నెటిజన్స్.. ప్రసాద్ భార్య సునీత, అతడికి దొరికిన వరం అని అంటున్నారు. ఎందుకంటే భర్తని ఇబ్బంది పెట్టే భార్య ఉన్న ఈ కాలంలో.. ఇలాంటి వైఫ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. మరి ప్రసాద్-సునీత బాండింగ్, వాళ్లిద్దరి అండర్ స్టాండింగ్ గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.