ఈ మధ్యకాలంలో హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులపై నెటిజన్స్ అభిమానం ఏమోగానీ ఆలోచనలు మితిమీరిపోతున్నాయి. సెలబ్రిటీస్ అన్నాక అప్పుడప్పుడు ఫ్యాన్స్, ఫాలోయర్స్ తో చిట్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. అలా ఓ టైమ్ చూసుకొని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చట స్టార్ట్ అవుతుందో లేదో.. వెంటనే నెటిజన్స్ నుండి పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ప్రశ్నలు బయటికి వస్తుంటాయి. పర్సనల్ లైఫ్ అయినా ఓ లిమిట్ లో అడిగితే బాగానే ఉంటుంది.. ఏకంగా వర్జినిటీ వరకూ వెళ్తున్నారు నెటిజన్స్.
ఇక ఇటీవల బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన పునర్నవి భూపాళంకి కూడా ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. నటిగా చేసింది తక్కువ సినిమాలే అయినా పునర్నవికి.. బిగ్ బాస్, సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. ఇక కుదిరినప్పుడల్లా ఫ్యాన్స్ ముచ్చటిస్తూ తనదైన శైలిలో సమాధానాలు చెబుతుంటుంది. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో చిట్ చేసిన ఈ అమ్మడికి రెగ్యులర్ కాంట్రవర్సీ ప్రశ్నలే అడిగారు నెటిజన్స్.
ఈ క్రమంలో చిట్ చాట్ లో భాగంగా ఓ నెటిజెన్ పునర్నవిని.. “నువ్వు వర్జిన్ వేనా?” అనే ప్రశ్న అడిగాడు. అందుకు స్పందించిన పునర్నవి.. ‘నేను ఈ ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్నా’ అని చెప్పి షాకిచ్చింది. మరో నెటిజెన్ ‘డేటింగ్ లో ఉన్నారా?’ అని అడిగాడు. దానికి పునర్నవి అవునంటూ సమాధానం ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ పునర్నవి ఎవరితో డేటింగ్ లో ఉందనే విషయంపై ఆరా తీసే పనిలో పడ్డారు నెటిజన్స్. ఇప్పుడు పునర్నవి చిట్ చాట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి గత రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న పునర్నవిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
ఇదీ సంగతి: పెళ్లి పీటలెక్కనున్న నటుడు ఆలీ కూతురు.. ఎంగేజ్మెంట్ వీడియో వైరల్!